Cricket

World Cup Ciriket: టీమిండియా జట్టుకు వరుస గాయాల బెడద

క్రికెట్ కు సంబంధించి ప్రపంచ కప్ సమీపిస్తున్న కొద్ది భారత్ జట్టులో గాయాల బెడద ఎక్కువవుతుంది. ఇప్పటివరకు బుమ్రా, జడేజా గాయాల కారణంగా దూరం కాగా, ప్రస్తుతం కొత్తగా దీపక్ చా హార్ కూడా వైదొలగనుండడం టీమిండియా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. ఒకపక్క ప్రపంచ కప్ దగ్గర పడుతూ ఉండగా టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల పాలవుతున్నారు. ఐసీసీ టైటిల్ను కచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవాలని ఆశపడుతున్న టీమ్ ఇండియాకు దీపక్ చాహర్ గాయంతో మూడోసారి షాక్ తగిలింది. ఇప్పటివరకు టీమిండియా జట్టుకు సంబంధించి ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు గాయాలపాలై వైదొల గారు.

టీమిండియా జట్టుకు వరుస గాయాల బెడద
టీమిండియా జట్టుకు వరుస గాయాల బెడద

ఇటువంటి పరిస్థితుల కారణంగా ప్రపంచ కప్ లో భారత్ యొక్క ప్రదర్శన అనేది ఏ విధంగా ఉంటుందో అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రోహిత్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్, మరియు విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. ఫేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ముఖ్యమైన పాత్ర పోషించేందుకు సిద్ధమైపోయాడు. అని ఆనందంలో ఉన్న టీమిండియా జట్టుకు మొట్టమొదటి ఎదురుదెబ్బ రవీంద్ర జడేజా రూపంలో తగిలింది. ఆసియా కప్ మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ పై కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా మోకాలి గాయం కారణంగా శస్త్ర చికిత్స చేసుకుంటూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

మెగా టోర్నీకి జట్టులోని సభ్యులను ప్రకటించే ముందే వైదొలగిన తొలి ఆటగాడిగా మారిపోయాడు. చాలా రోజులపాటు ఆటకు దూరంగా ఉండి టీ20 సీరియస్ లో జట్టులోకి వచ్చిన బూమ్రా కూడా షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనకి వెన్నునొప్పి వస్తుందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కారణంగా బూమ్రా ఈ మ్యాచ్ తో పాటు, టి ట్వంటీ, వన్డే సిరీస్ కు, దూరమయ్యాడు. ఇంకా మెగా టూర్ నుంచి చాలా సమయం ఉంది కదా ఈ లోపు కోలుకొని ఈ మెగా టూర్ ని ఆడతారులే అని భావించిన సగటు భారతీయ అభిమానికి మరో షాకింగ్ వార్త తెలిసింది.

ఈ సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ కు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయంపై బూమ్రా ప్రతిస్పందిస్తూ మెగా టోర్నీలో ఆడ లేకపోవడం తనకు చాలా బాధను కలిగిస్తుందని చెప్పడం జరిగింది. బూమ్రా మెగా మ్యాచ్ నుండి వైదొలగడం పై అభిమానులు ఈ విధంగా స్పందించారు. జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ఆటగాళ్లకు గాయాలు సాకుగా మారాయి అదే భారత టి20 లీగులు మాత్రం అన్ని మ్యాచ్లు ఆడేస్తారు. ఈ విషయం బుమ్ర వైదొలగడంపై అభిమానుల కౌంటర్. ముగ్గురు ఆటగాళ్లు లేకపోతేనే భారత్ t20 ప్రపంచ కప్ గెలవలేదా ?అనే వాక్యాలు వినిపిస్తున్నాయి అలాగే ఇతర ప్లేయర్లు ఆ స్థానాలను భర్తీ చేయగలరా? అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

షమీ, సిరాజ్ వంటి పేసర్లు కూడా భారత్కు ఉన్నారు. అలాగే అక్షయ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ ఆల్ రౌండర్ లు కూడా భారత్ జట్టుకు సొంతం. అయితే కీలకమైన ఆటగాళ్లు ఆటకు హాజరు కాలేకపోతే జట్టు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంది. ఆపోజిట్ టీం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ బౌలర్ బూమ్ రా లేకపోవడం వల్ల టీమిండియా జట్టు డెత్ ఓవర్ లో బలహీనంగా కనిపించింది. భూమిరా స్థానంలో తుది జట్టులో షమీ, సిరాజ్ లలో ఎవరుంటారు కూడా తెలియదు.షమి అంటే డెత్ ఓవర్ ను చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు కానీ భూమిరా స్థానాన్ని ఇతను పూర్తి చేయలేడు .

బూమ్ర తనదైనా శైలిలో యార్కర్లతో టాప్ బ్యాటర్లను సైతం వనికిస్తా డు. ఇప్పుడు బుమ్రా లేకపోవడం వల్ల ప్రత్యర్ధులు మన బౌలింగ్ ని తేలిగ్గా ఎదుర్కోగలరు. భారత టి20 లీగ్ గత గత సీజన్ కు ముందు వరకు గాయాలతో బాధపడుతున్న హర్దిక్ పాండ్యా ప్రస్తుతం కోల్కున్నాడు చాలా బాగా ఆడుతున్నాడు. జట్టులో ఉన్న ఏకైక స్పేస్ ఆల్ రౌండర్ ప్రస్తుతం ఇతనే. పాండ్యాకు మళ్ళీ వెన్నునొప్పి వస్తే టీమిండియా కష్టాల బారిన పడినట్లే. ఫేస్ ఆల్ రౌండర్ మరొకరు లేరనే చెప్పాలి. శర్దూల్ ఠాకూర్ ను కూడా ఆస్ట్రేలియా పంపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

శార్దూల్ ఉన్నప్పటికీ అతనిని ఆర్థిక స్థాయిలో ఆట ను ఆశించడం అత్యాశ. జడేజా, బూ మ్రా, దీపక్ లేకపోతే ఎందుకు కంగారు పడుతున్నారు మిగతా ఆటగాళ్లకి అవకాశం వస్తుంది కదా. మిగతా ఆటగాళ్లు తమ టాలెంట్ ని వినియోగించుకొని బాగా ఆటని ఆడితే వారే అభిమానులను సంపాదించుకుంటారు.”తనకు వచ్చిన అవకాశాన్ని అక్షర్ రెండు చేతుల వినియోగించుకుంటున్నారు. భారత క్రికెట్ లోనే ఇలా జరుగుతుంది. రవీంద్ర జడేజాను మనం మిస్ అవుతున్నామనేది నిజమే. అయితే అతని స్థానంలో అక్షర్ ఎంపిక విలువైనదే. ముఖ్యంగా అతను బంతితో ఆకట్టుకున్న విధానం బాగుంది.

బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి, తను ఇక్కడ సరిపోతాడు. ఫీల్డింగులోనూ మెరిస్తే సరిపోతుంది.”అని అక్షర్ పటేల్ గురించి మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. బూమ్రా స్థానంలో వచ్చే వారికి ఇది ఒక మంచి అవకాశం అని టీమిండియా కు సంబంధించిన మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగారు సూచించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button