Sports News

గత రికార్డులన్నీ బ్రేక్ చేసిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అత్యధిక టిఆర్పి రేటింగ్స్.

క్రికెట్లో ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతుంది. ప్రస్తుతం దీంట్లో భాగంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ జట్టులన్నీ ప్రపంచ కప్ టైటిల్ ని సొంతం చేసుకోవడం కోసం ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకునేందుకు పోటీపడే సూపర్ 12 జట్లను కూడా ఎంపిక చేయడం జరిగింది.

గత రికార్డులన్నీ బ్రేక్ చేసిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అత్యధిక టిఆర్పి రేటింగ్స్.
గత రికార్డులన్నీ బ్రేక్ చేసిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అత్యధిక టిఆర్పి రేటింగ్స్.

దీంట్లో భాగంగా అక్టోబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టీమిండియా జట్టు వర్సెస్ పాకిస్తాన్ జట్టు మ్యాచ్ జరిగింది. ఇంట్లో భాగంగా టీమిండియా జట్టు తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. యావత్ ప్రపంచం మొత్తం కల్లప్పగించి ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఊహించినట్లుగానే ఉత్కంఠ భరితంగా సాగింది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ చివరికి సూపర్ డూపర్ హిట్ అయింది.

ప్రతిసారి ఉండే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే హై వోల్టేజ్ ని మళ్లీ తీసుకొచ్చింది. అయితే టీమిండియా కు సంబంధించిన మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చి, ఓటమికి దగ్గరలో ఉన్న టీమిండియా చెట్లు ఒంటి చేత్తో విజయం వైపు తీసుకొచ్చాడు. విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకోవడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం జరిగింది.ఇంతకుముందు ఉన్న రికార్డులన్నీ బ్రేక్–తూటాలు, తుపాకులు లేని ఈ యుద్ధంలో దక్కిన విజయమనేది క్రికెట్ అభిమానులందరికీ సంతోషాన్నిచ్చింది.

అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండించింది. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ గత రికార్డులను బేక్ చేస్తూ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ దెబ్బకు గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఆసియా కప్ వేదికగా భారత్ వర్సెస్ పాక్ తొలి మ్యాచ్ కోటి 30 లక్షల వ్యూస్ తో ఐపీఎల్ 2022 సీజన్, గత టి20 ప్రపంచ కప్ వ్యూ యర్ షిప్ రికార్డులను బద్దలు కొడితే తాజాగా జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోటి 80 లక్షల వ్యూస్ తీసుకొచ్చింది.

హాట్స్టార్ లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే, టిఆర్పి రేటింగ్స్ లో స్టార్ స్పోర్ట్స్ రికార్డ్లను సృష్టించినట్లే. ఈ మ్యాచ్ విజయంతో అభిమానులు ఒకరోజు ముందే దీపావళి పండగ చేసుకుంటూ ఉండగా, ఈ మ్యాచ్ ద్వారా స్టార్ స్పోర్ట్స్ కూడా లాభపడింది.విరాట్ కోహ్లీ విశ్వరూపం–అక్టోబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రపంచకప్ సాధించడానికి తొలి మ్యాచ్ కావడంతో ఓటమి అంచులకు వెళ్లి, మళ్లీ విజయం సాధించడం అనేది బ్లాక్ బస్టర్ వ్యూస్ కి ఒక కారణం అయితే, మరోవైపు విరాట్ కోహ్లీ విశ్వరూపం మరో కారణం.

ఓడిపోతుందన్న సమయంలో విరాట్ కోహ్లీ టీమిండియా జట్టును వంటి చేత్తో గెలిపించే ప్రయత్నం చేశాడు. గెలిపించాడు కూడా. ఇక ఆఖరి ఓవర్లో మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ విజయం భారత్ సొంతం కావడం అనేది ఇలా ఎక్కువ వ్యూస్ రావడానికి కారణం. ఈ మ్యాచ్ ఇలా జరగడం ద్వారా అభిమానులకు అసలు సీసలు మజాను అందించింది. ఈ పరిస్థితులన్నీ కలిసి స్టార్ స్పోర్ట్స్ కి పంట పండేలా చేశాయి.

కింగ్ ఇస్ బ్యాక్–భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 159 పరుగులు చేసింది. పాకిస్తాన్ మ్యాచ్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత రంగంలోకి తిరిగిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులను చేసి విజయం సాధించింది. మొత్తానికి విరాట్ కోహ్లీ ఓడిపోతున్న టీమిండియా జట్టును ఒంటి చేత్తో గెలిపించ ప్రయత్నం చేసి గెలిపించాడు. విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావడం ద్వారా జరిగిన ఈ మ్యాచ్లో విజయం టీమిండియా జట్టుకు దక్కింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button