Sports News

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన Kieron Pollard

Kieron Pollard: క్రికెట్ ఆటకు సంబంధించి అబుదాబిలో టీ10 లీగ్ జరుగుతుంది. ఈ లీగ్ కు సంబంధించి బుధవారం ,నవంబర్ 24 వ తారీకు ఆరంభ మ్యాచ్ బంగ్లా టైగర్స్ వర్సెస్ న్యూయార్క్ స్ట్రైకర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా బంగ్లా టైగర్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు బ్యాటింగ్ పూర్తయిన తర్వాత నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈ లీగ్ లో కిరణ్ పోలా ర్డ్ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. తనలో ఇంకా పవర్ తగ్గలేదని, తన సత్తా చాటుకున్నాడు. ఈ మ్యాచ్లో కీలకమైన పరిస్థితుల్లో 19 బంతుల్లో45 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. పొట్టి ఫార్మాట్లో పోలా ర్డు కి బిగ్ మాన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ పేరుకు తగినట్టుగా మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చి జట్టు ని ఆదుకునే ప్రయత్నం చేసి, బిగ్ మ్యాన్ అనే పేరును మళ్లీ నిలబెట్టుకున్నాడు.

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన న్యూయార్క్ స్ట్రైకర్స్ ఆటగాడు కిరణ్ పొలర్డు
మళ్లీ ఫామ్ లోకి వచ్చిన న్యూయార్క్ స్ట్రైకర్స్ ఆటగాడు కిరణ్ పొలర్డు

కిరణ్ పోలార్డ్ వ్యక్తిగత సమాచారం-
ఇతని పూర్తి పేరు కీరన్ అడ్రియన్ పొలార్డ్. పుట్టింది 1987 సంవత్సరం మే 12వ తేదీ. టకారిగ్వా, ట్రినిడాడ్& టొబాగో ప్రాంతంలో జన్మించాడు.పాలీ, 144p ABD, బిగ్ మ్యాన్, మూత బైసన్ అనే మరో పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. బ్యాటింగ్ కుడి చేతివాటం, బౌలింగ్ కుడి చేతి మాధ్యమం. ఇతను బ్యాటింగ్ ఆల్రౌండర్. ఇక కిరణ్ పొలర్డ్ అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్లో తన సత్తా మల్లి చాటుకున్నాడు.

మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా టైగర్స్ 10 ఓవర్లలో 131/5 స్కోర్ చేశారు. బంగ్లా టైగర్స్ టీం కి సంబంధించిన ఏవిన్ లూయిస్ 22 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టుకు శుభ ఆరంభాన్ని అందించాడు. తర్వాత మున్రో 17 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు.132 పరుగులు టార్గెట్గా ఇచ్చింది బంగ్లా టైగర్స్.

నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఈ జట్టుకు సంబంధించి న ఆజామ్ ఖాన్ 13 వంతుల్లో 34 పరుగులు చేశాడు. రేట్ అయితే చాలా తక్కువగా ఉంది. కిరణ్ పోలార్డ్ బరిలోకి దిగాడు.

ఫోర్లు ,సిక్సర్లతోనే మాట్లాడుతూ కేవలం19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు చేసి మొత్తం 45 పరుగులు చేశారు. ఇంత కష్టపడినా కూడా ఫలితం దక్కాలంటే, మ్యాచ్ గెలవాలంటే ఎక్కువ పరుగులు అవసరం ఉంది. 19 పరుగుల తేడాతో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఓటమిపాలైంది. మ్యాచ్లో పోలార్డ్ 45 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.

న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు సంబంధించి మ్యాచ్లో కిరణ్ పొలార్డ్ హైలెట్ గా నిలిచాడు. మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. తన సత్తా చాటాడు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో పొలార్డ్ ఐదు స్థానంలో కాకుండా ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేది. మ్యాచ్ను కచ్చితంగా గెలిపించేవాడు. ప్రస్తుతం బంగ్లా ట్రైగర్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది న్యూయార్క్ స్ట్రైకర్స్

అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 2022 లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పెద్దగా రానిచలేదు పోలర్డ్. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇతనికి వయస్సు అయిపోయిందని 23వ సంవత్సరంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ నుంచి ఇతని రిలీజ్ చేయడం జరిగింది.

ఐపీఎల్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా కిరణ్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ కే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ లేని టైంలో ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా బాధ్యతలు వహించాడు. ఐపీఎల్ ఆడితే ముంబై ఇండియన్స్ కే ఆడతానని అన్నాడు. ముంబై ఇండియన్స్ ఇతన్ని వదిలేస్తుంది అనుకోలేదు. ఈ కసి తోనే ఈరోజు తిరిగి ఫామ్ లోకి వచ్చి ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించాడు

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button