Sports News

ENG vs Ind T20wc: ఇండియా పై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్.

ENG vs Ind T20wc: టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ -2 మ్యాచ్ జరిగింది. అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇండియా టీంకు సంబంధించిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇరు టీం లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు లో ప్రసారం అందిస్తున్నారు.

భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్ భారత జట్టు స్క్వాడ్ 2022-
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా , R. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్. షమీ.

ఇండియా vs ఇంగ్లండ్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ 2022-

జోస్ బట్లర్ (C & WK), మోయిన్ అలీ, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్ (WK), బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

ఇండియా పై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్.
ఇండియా పై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్.

టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ లో ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది . ఈ మ్యాచ్ లో క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ ఐదు బంతుల్లో ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జోర్దాన్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 28 బాల్స్ లో 27 పరుగులు చేసి 8.5 ఓవర్లో అవుట్ అయ్యాడు.

రషీద్ బౌలింగ్లో సూర్య కుమార్ యాదవ్ 10 బాల్స్ లో 14 పరుగులు చేసి 11.2 ఓవర్లో అవుట్ అయ్యాడు. జోర్దాన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు చేసి 18 ఓవర్లో అవుట్ అయ్యాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో పంత్ నాలుగు బాల్స్ లో ఆరు పరుగులు చేసి 19.3 ఓవర్ లో అవుట్ అయ్యాడు.

జోర్దాన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 32 బంతుల్లో 63 పరుగులు చేసి 20 ఓవర్లలో లాస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. టీమిండియా బ్యాటింగ్ పూర్తయిన తర్వాత 168/6 స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ కు 169 పరుగులు టార్గెట్గా ఇచ్చింది టీమిండియా.ఇంగ్లాండ్ బ్యాటింగ్ తర్వాత పది వికెట్ల తేడాతో 16 ఓవర్ లోనే ఘన విజయం సాధించింది.

169/0 స్కోర్ తో 16 ఓవర్ లోనే గెలిచారు. ఇంగ్లాండ్ ఓపెన్ అయినా హెల్స్47 బాళ్లలో 86 పరుగులు చేసాడు. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, హెల్స్ ఒంటి చేత్తో ఈరోజు టార్గెట్ ని అందుకున్నారు. టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button