Sports News

IND vs BAN 3RD ODl: మూడో వన్డే మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా

బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించి రెండు వన్డే మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

డిసెంబర్ 10వ తారీఖు శనివారం బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మూడో వన్డే మ్యాచ్ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ బౌలింగ్ తీసుకున్నాడు. మ్యాచ్ కు సంబంధించిన ప్లేయర్స్ లిస్ట్ చూస్తే….

మూడో వన్డే మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా
మూడో వన్డే మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (w/c), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): అనాముల్ హక్, లిట్టన్ దాస్(సి), షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్.

ఈ మ్యాచ్ లో ఇండియా 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అయితే బంగ్లాదేశ్తో జరిగే మూడు వన్డే మ్యాచ్లో రెండు బంగ్లాదేశ్ గెలవగా ఒకటి ఇండియా గెలిచింది. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 409/8 స్కోర్ చేసింది.

410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్ లోనే 182 పరుగులు అనే తక్కువ స్కోరుకు మాత్రమే పరిమితమై ఆల్ అవుట్ అయింది. అయినా ఈ సిరీస్ సొంతం చేసుకుంది బంగ్లాదేశ్.

మ్యాచ్లో టీమిండియ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 24 ఫోర్లు, పది సిక్సులు కొట్టి 210 పరుగులు చేశాడు. కింగ్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు సాధించాడు.

బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ బౌలర్లు షేకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు, ఇబాదత్ హుస్సేన్ రెండు వికెట్లు, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒక వికెట్ మోహదీ హసన్ లు ఒక వికెట్ తీశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button