Sports News

Cricket:టీమిండియా జట్టులో షమీ రాకతో ఆ ముగ్గురు బెంచ్ కే పరిమితం

Cricket:క్రికెట్ ఆటకు సంబంధించి ఆస్ట్రేలియా వేదికన ప్రపంచకప్ అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా టీమిండియా జుట్టులో గాయాల బెడద ఎక్కువైంది. అలాగే శ్రీలంకకు సంబంధించి న జట్టులో కూడా గాయాల వల్ల కొంతమంది బౌలర్లు ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడం జరిగింది.

టీమిండియా జట్టులో షమీ రాకతో ఆ ముగ్గురు బెంచ్ కే పరిమితం.
టీమిండియా జట్టులో షమీ రాకతో ఆ ముగ్గురు బెంచ్ కే పరిమితం.

పాకిస్తాన్తో ఈనెల 23న జరిగే మ్యాచ్ ద్వారా భారత్ ప్రపంచ కప్ వేటను ప్రారంభించబోతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్ని గెలిచి న్యూజిలాండ్తో మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా జట్టుకు సంబంధించి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో భారత్ మ్యాచ్ అనేది ఎన్నో రోజులు లేదు. ఈ సమయంలో ఈ మ్యాచ్ ని గెలవడంతోపాటు టి20 వరల్డ్ కప్ ని గెలవాలని పట్టుదలతో ఉంది.

మొన్నటి వరకు కూడా టీమిండియా జట్టును గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తో పాటు బూమ్రా కూడా గాయాల పాలవడం వల్ల ఈ టోర్నమెంట్ కి దూరం కావడం జరిగింది. ఇలాంటి మంచి బౌలర్లు దూరం కావడం వల్ల టీమిండియా జట్టు బలహీనంగా కనిపించింది.

అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ వేసిన మహమ్మద్ షమీ భారత్ జట్టుకు, క్రికెట్ అభిమానులకు ఒక కొత్త ఉత్సాహాన్ని అందించాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడి ఏడాది గడిచిన, కరోనాతో కొంతకాలం ఇబ్బంది పడ్డ, ఆశిస్ తొ జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. ఆరు బంతులు వేసినా అతను, నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి, మూడు వికెట్లను తీయగలిగాడు. షమీ యొక్క అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా జట్టులో మొత్తం మారిపోయాయి. ఫేస్ బౌలింగ్ ని షమీ నడిపించనున్నాడని అర్థమైంది.

షమీ, భువనేశ్వర్ స్థానాలు తుది జట్టులో కాయం. ఇక మూడో సీమర్ స్థానం కోసం అర్ష్ దీపు, హర్షల్ పటేల్ మధ్య పోటీ ఉంది. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్లో హర్షల్ పటేల్ 19వ ఓవర్ ను అద్భుతంగా వేశాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ కోసం అర్ష దీప్ కంటే హర్షల్ పటేల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అలాగే స్పిన్నర్ గా అశ్విన్, అక్షర్ పటేల్ కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా యజువేంద్ర చాహల్ కూ పాకిస్తాన్ తో ఆడే అవకాశం లేదు.

అర్ష దీప్, రిషబ్ పంత్, చాహల్లు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎలాగైనా టీమిండియా జట్టు అభిమానులు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో ఈనెల 23న జరిగే మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీమిండియా జట్టు పాకిస్తాన్ పై ఖచ్చితంగా గెలవాలని ఆశిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version