Sports News

టీమిండియా జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్

Suni Gavaskar: క్రికెట్ టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరిగిన ప్రపంచ కప్ పోరు ముగిసింది. గ్రూప్ -1నుంచి పాకిస్తాన్ ,గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ లో గెలిచి ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ 2022ను క్రికెట్ పుట్టినిల్లు అయినా ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ప్రపంచకప్ ను సాధించడం ఇది రెండోసారి.

ఇక ఈ టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో టీమిండియా జట్టు న్యూజిలాండ్లో పర్యటించనుంది. నవంబర్ 18 వ తారీకు నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనున్నాయి. టీమిండియాలో జరుగుతున్న పరిస్థితులపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్
టీమిండియా జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్

టీమిండియా జట్టుకు ప్రధాన కోచ్ ఉండగా, మరొక బ్యాటింగ్ కోచ్ టీం ఇండియాకు అవసరం లేదని, ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల బ్యాటర్స్ గందరగోళానికి లోనవుతారని, ఏ కోచ్ మాట వినాలో తెలియక మ్యాచ్ సరిగా ఆడకపోయె ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్లో వరల్డ్ కప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగిన టీమిండియా జట్టు సెమీ ఫైనల్ లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. సెమీఫైనల్ 2 మ్యాచ్లో టీమిండియా, ఇంగ్లాండు జట్టుతో పోటీపడి పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించి ఫైనల్ కు చేరింది. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ టోర్నమెంట్లో టీమిండియాలోని కొందరి ప్రదర్శన వాస్తవంగానే సరిగ్గా లేదని అందరి అభిప్రాయం.

విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ వీళ్లు తప్ప మిగతా వాళ్ళందరి ప్రదర్శన అంతంత మాత్రం గానే ఉంది. ఈ వైఫల్యాలపై స్పందించిన టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ జట్టులో జరుగుతున్న తాజా పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బీసీసీఐ నిర్ణయాలను విమర్శిస్తూనే, జట్టులో ఆటగాళ్ల కన్నా సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కువ అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పరిస్థితులు జట్టులో ఉన్నప్పుడు బ్యాటర్స్ గందరగోళానికి గురి అయ్యే ఛాన్స్ ఉందని, ఏ కోచ్ మాట వినాలో తెలియని పరిస్థితికి ఆటగాళ్లు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం.

టీమిండియా జట్టుకు ప్రధాన కోచ్ గా గొప్ప బ్యాట్స్మెన్ అయిన రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు మరొక బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు. ఒక కోచ్ ఒక విషయం చెప్పడం, మరొక కోచ్ మరో విషయం చెప్పడం లాంటి పరిస్థితులు జరిగినప్పుడు బ్యాటర్స్ కన్ఫ్యూజన్ కి గురయ్యే అవకాశం ఉంది. అంటే పరిస్థితుల్లో మ్యాచ్ సరిగా ఆడకపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి అనాలోచితం నిర్ణయాలను పక్కకు పెట్టి ఎవరైతే బాగా ప్రదర్శన ఇస్తారో వారిని జట్టులో ఆడిపించండి, ఆడని వారిని ఆడిపించకండి అని ఆయన చెప్పడం జరిగింది.

మేం 1983 వరల్డ్ కప్ ఆడే టైంలో మా వెంట ఒకే ఒక మేనేజర్ ఉండేవాడు. 1985 టోర్నమెంట్ లో కూడా ఒక్కడే ఉన్నాడు. అంతేకాకుండా 2011 వరల్డ్ కప్ టైం లో కూడా పరిమిత సంఖ్యలోనే సపోర్టింగ్ స్టాఫ్ ఉండేవారు. వీరి సంఖ్య పెరుగుతూ ఉంటే ఎవరి మాట వినాలి అని ఆటగాళ్లు గందరగోళానికి గురి అయ్యే ఛాన్స్ ఉంది అని టీమిండియా జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు సునీల్ గవాస్కర్.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button