తెలంగాణ క్యాబినెట్ భేటీ…





ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్లో క్యాబినెట్ సమావేశం జరిగింది. మొదటగా కొవిడ్ పరిస్థితులపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్య అధికారులతో క్యాబినెట్ ఆరా తీసింది.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు క్యాబినెట్ కు సమాచారం అందించారు. ఇరు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన అనంతరం పరిస్థితులు క్యాబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. స్కూళ్లు కాలేజీలు తెరిచిన తర్వాత, కరోనా కేసులు పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని వారు క్యాబినెట్ కు వివరించారు. అన్ని రకాల మందులు ఆక్సిజన్,టెస్ట్ కిట్స్, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు రెండు కోట్ల 56 వేల 159 డోసులు అందించారని వారిలో ఒక కోటి 45 లక్షలు 19వేల 909 మొదటి డోస్, 55 లక్షల 36వేల 250మంది
రెండు డోసులు ఇవ్వడం జరిగింది. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభం అవుతుందని, ప్రతి గ్రామ, మండల జిల్లా స్థాయిలో పంచాయతీ మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు క్రియా శీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్ధత తో వ్యవహరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు, క్యాబినెట్ నిర్దేశించింది.

కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించాలని కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఆర్ అండ్ బి, వైద్య శాఖను క్యాబినెట్ ఆదేశించింది. హైదరాబాదులో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ ఏర్పాటు క్యాబినెట్ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలనీ, అత్యంత వేగంగా ఆసుపత్రులు నిర్మాణం జరగాలని క్యాబినెట్ ఆదేశించి. గతంలో 130 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేదని, దాన్ని ఇప్పటికీ 225 మెట్రిక్ టన్నుల పెంచుతున్నామని, దీంతో మరింత పెంచి 550 మెట్రిక్ టన్నుల చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులు క్యాబినెట్ ఆదేశించింది.


ఒకవేళ చిన్నపిల్లల కరోనా వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు క్యాబినెట్ కు వివరించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాటులో భాగంగా ఇప్పటికే సమకూర్చుకు ఉన్నామని వైద్య అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్యం మౌలిక వసతులు పురోభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని తదుపరి క్యాబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో అంశాలపై క్యాబినెట్ చర్చ జరిగింది.





స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker