నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..


5,323 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ పై తాజాగా కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

పాఠశాల విద్యాశాఖలో ఏకంగా 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ పాఠశాలకు ఇన్ స్ట్రాక్టర్లు,1435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే కేజీబీవీ లకు,937 పోస్ట్ గ్రాడ్యూయేట్ రెసిడెన్షియల్ టీచర్ల పోస్టుల భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ఆదర్శ పాఠశాలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కోఆర్డినేటర్లు మరియు ప్రభుత్వ కళాశాలలకు 211 బోధన సిబ్బంది పోస్టులకు కు తాత్కాలిక ప్రతిపాదనను భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు మరియు నియామక ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి ప్రకటన పై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker