ఈనెల 14న సీఎం కేసీఆర్ యాదాద్రికి రానున్నారు..



యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు సమీక్షించేందుకు ఈ నెల 14న సీఎం కేసీఆర్ యాదాద్రికి రానున్నారు.

ఐదున్నర ఏళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి ఆలయ నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయి.
త్వరలో ప్రధానాలయంలో లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తికాగా,మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. స్వామివారి కైంకర్యాలకు ఉద్దేశించిన పుష్కరిణిని సిద్ధం చేశారు. దిగువ మరో పుష్కరిణినీ కూడా పూర్తి కావస్తుంది. నాలుగు దిక్కుల విశాలమైన మాడవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం కూడా సిద్ధమైంది.

సీఎం కేసీఆర్ ర్ ఈ నెల 1న ఢిల్లీ వెళ్లారు. 3న ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పున ప్రారంభానికి రావాలని కోరారు. దీనికి ప్రధాని కూడా సముఖత వ్యక్తం చేశారు. మరోవైపు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం ఆలయ పనులను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు CMO ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఈ సందర్భంగా ప్రధానాలయం లిఫ్టు, రథశాల, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు.

CM KCR: చినజీయర్ స్వామి మరోసారి సంప్రదించి ఆలయ పున ప్రారంభం పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీ నిర్మాణం కూడా పూర్తయింది.
15 కాటేజీల అన్ని పనులు పూర్తయ్యాయి.
కెసిఆర్ ఆదేశాలతో మరో వారం రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కిషన్ రావు చెబుతున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలు పార్కింగ్ సౌకర్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఘట్ కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ రైలు యాదాద్రి వరకు పొడగించేందుకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. యాదాద్రి గుట్ట కింద నుంచి ఆలయం దగ్గరకు ఫ్రీ ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా గా మూడు హెలిప్యాడ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker