lang="te"> కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి వీగన్. - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి వీగన్.



Hyd: వ్యక్తిగత స్వార్థాల కోసం సాటి జీవులను హింసించ కూడదు అని, ప్రతి జీవికి స్వేచ్ఛాయుత జీవనాన్ని అందించడం మన బాధ్యతని వినూత్నంగా అవగాహన కనిపిస్తోందని నగరానికి చెందిన వీగన్ శారద.

అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏకంగా ప్రపంచంలో ఎత్తైన ఏడు శిఖరాలలో ఒక్కటైన కిలిమంజారో పర్వతం అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఆఫ్రికా ఖండం లో ఎత్తైన 19,340 అడుగుల కిలిమంజారో పర్వతం శిఖరాన్ని శారద తన ఐదుగురు బృందంతో కలిసి ఈ నెల 10వ తేదీన చేరుకున్నారు. అంతేకాకుండా కిలిమంజారో అధిరోహించిన తొలి వీగన్ శారదా రికార్డు నమోదు చేశారు.

జంతు సంబంధిత పదార్థాలు, వస్తువులను వాడకుండా వాటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పాటుపడే వారిని విగన్స్ గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీగనిజాన్ని ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తను ప్రపంచంలో అతి ఎత్తైన ఈ పర్వతారోహణకు సిద్ధమయ్యాం అని ఆమె పేర్కొన్నారు. మన నిత్యజీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నోరకాలుగా జీవ హింస కు కారణమవుతున్నాయని, అందులోని హింస, వేదన కు వ్యతిరేకంగా తాను వీగన్ మారానని తెలిపింది. వీగన్ మారడం క్లిష్టతరం గా కాదని, దశలవారీగా ప్రయత్నిస్తేనే అందరూ వీగన్ గా మారవచ్చని, అందుకే తానే నిదర్శనం అన్నారు.