ఖైదీల సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణ ‘ఉన్నతి’ బేష్



చర్లపల్లి: జాతీయ న్యాయ సాధికార సంస్థ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తో కూడిన జడ్జిల బృందం ఆదివారం చెర్లపల్లి కేంద్ర కర్మాగారాన్ని సందర్శించింది.

ఖైదీల సంక్షేమానికి చేపట్టిన సంస్కరణలను తెలంగాణ జైలు శాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఉన్నతి కార్యక్రమం ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ బీనాలను అడిగి తెలుసుకున్నది. జైలులోని పలు బ్యారక్‌లు, ఖైదీలు పండిస్తున్న పంటలు వివరాలను డీజీ రాజీవ్ త్రివేది న్యాయమూర్తుల బృందానికి వివరించారు. సైకాలజీ ల్యాబ్, వంటశాల ను పరిశీలించిన బృందం సభ్యులు, ఖైదీలకు అందిస్తున్న భోజనం రుచి చూసి అధికారులును అభినందించారు.

కారాగారం లో ఏర్పాటుచేసిన ‘ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఖైదీల సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణలు, విడుదల అనంతరం వారి కల్పిస్తున్న పునరావాస చర్యలు ఉపాధి అవకాశాలను డీజీ వారికి తెలియజేశారు. అనంతరం సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ మాట్లాడుతూ ఖైదీల మానసిక ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు వారి సంక్షేమం కోసం ఉన్నతి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని జిల్లాల్లో చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీజీ రాజీవ్ త్రివేది మాట్లాడుతూ ఖైదీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యంగా వారి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం బృందం సభ్యులను తెలంగాణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

కారాగారాన్ని సందర్శించిన బృందంలో జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ సభ్యులు, కార్యదర్శి అశోక్ జైన్, సభ్యురాలు రేణుక, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్‌ జడ్జి రాధా రాణి, జిల్లా కార్యదర్శి శ్రీదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి, హైకోర్టు ఉన్నతాధికారి ఆంజనేయులు ఉన్నారు.
జైళ్ల శాఖ ఐజి రాజేష్, హైదరాబాద్ రేంజ్ డిఐజి మురళి బాబు, కేంద్ర కారాగారం సూపర్డెంట్ సంపత్, వ్యవసాయ క్షేత్రం సూపర్ డెంట్ శివ కుమార్ గౌడ్,
డిప్యూటీ సూపర్డెంట్ లు కృష్ణమూర్తి, కాళిదాస్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker