తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కో కన్వీనర్ రజిని కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
వరంగల్ :
తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టును ఖండిస్తూ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కో కన్వీనర్ రజిని కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల హక్కులను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలను బయట పెడుతున్న తీన్మార్ మల్లన్న ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
నీళ్లు, నియామకాలు ప్రధాన ఎజెండాగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి నియామకాలు సరిగా జరగలేదని, నీళ్ల విషయంలో అక్రమాలు చేశారని, అధికార ప్రతిపక్ష నేతల భూ కుంభ కోణాలు వెలికి తీసి ప్రశ్నించే గొంతుక గా బయట పెడుతున్న తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రభుత్వానికి ఏం లాభం లేదన్నారు. ఇప్పటికే వేలల్లో ప్రశ్నించే గొంతుకలు అవతారమెత్తాయని చెప్పారు.
Q న్యూస్ వేదికగా అనేక సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తున్న తరుణంలో, ప్రభుత్వ తప్పులను అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి అసలు Q న్యూస్ నే లేకుండా చేసే కుట్ర ఈ ప్రభుత్వం పన్నిందని, ఉద్దేశపూర్వకంగానే పలుమార్లు ఆఫీస్ పైన రైడ్ చేస్తూ కంప్యూటర్ లో హార్డ్ డిస్కులు ఎత్తుకు వెళ్లారన్నారు. అయినా కూడా Q న్యూస్ని ఏమి చేయలేక పోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) పార్లమెంట్ కన్వీనర్ సాయిని నరేందర్, కట్ల శ్రీనివాస్ (కాంగ్రెస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు),
వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ (బీసీ సెల్ అధ్యక్షులు),
చింతాకుల అనిల్ కుమార్ (27వ డివిజన్ కార్పొరేటర్ బిజెపి),
పోతుల శ్రీమన్నారాయణ (కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ కార్పొరేటర్),
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు గూడూరు మాంచాల, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ నాయక్,
RHP ఆ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్,
RHP జిల్లా అధ్యక్షులు చిలువేరు రాజేందర్,
జేఏసీ చైర్మన్ కాకతీయ యూనివర్సిటీ తిరుపతి యాదవ్, పుప్పాల సమ్మయ్య, యువ న్యాయవాది రాచకొండ ప్రవీణ్, BC కులాల ఐక్య వేదిక అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఐతo నగేష్,
రంజిత్ (TGVP),
ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుమన్,
రజక సంఘం అధ్యక్షులు రాపర్తి కుమార్ గాడ్గే,
డాక్టర్ రామకృష్ణ (కాం గ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సిటీ ప్రెసిడెంట్), న్యాయవాది రవి, రెడ్డి కుల పేదల సంక్షేమం అభవృద్ధి సంఘం అర్బన్ జిల్లా నాయకులు మార్త శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న టీం అర్బన్ జిల్లా కో కన్వీనర్ తానం రామన్ పటేల్, Md జాకీర్ అలీ, మల్లన్న టీమ్ సభ్యులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.