పంచాయతీల నిధుల మళ్లింపు పూర్తిగా అవాస్తవం, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో మూడు రోజులపాటుగా వాయిదాపడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి అక్టోబరు 1న శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శాసన సభలో పంచాయతీరాజ్ అంశంపై చర్చ లో భాగంగా పంచాయతీల నిధుల మళ్లింపు జరుగుతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలు పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వివరణ ఇచ్చారు.
పంచాయతీల నిధులు దారి మళ్లింపు ప్రచారం పూర్తిగా సత్యదూరమని కేసీఆర్ స్పష్టం చేశారు.
భారతదేశంలో అత్యంత గౌరవంగా, గర్వంగా తల ఎత్తుకుని చెప్పుకునే సర్పంచులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర సర్పంచుల లేనని అన్నారు. ఈ అంశంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అధికారులు కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీ, నీకు కూడా ప్రశ్నించారని కేంద్రం అనేక అవార్డులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక వ్యక్తిపై సగటున గ్రాంట్ కింద రూ.4 ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.650 పైగా ఖర్చు చేస్తుందని చెప్పారు. సభలో ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదని, మీరు అద్బుతంగా మాట్లాడండి.మీ కంటే అద్భుతంగా మేం చెప్తాం.మన ఇద్దరి కన్నా ప్రజలు అద్భుతంగా గమనిస్తారనీ సీఎం కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సర్పంచులు బాధపడ్డ మాట వాస్తవమేనని, ఇవాళ బాధపడటం లేదని, చాలా సంతోషంగా ఉండండి గర్వపడుతున్నాను అన్నారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా డబ్బులు ఇబ్బంది వస్తే, శాసనసభ్యులు, మినిస్టర్ జీతాలు అపి పంచాయతీలకు గ్రాండ్ రిలీజ్ మాత్రం ఆపొద్దని చెప్పానన్నారు. మరోవైపు ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు నిధులు ఇస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. మ్యానిఫెస్టోలో గాని, నూతన పంచాయతీ రాజ్ చట్టం లో ఆ ప్రస్తావనే లేదని చెప్పారు.నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.