సాంకేతిక విద్యలో జేఎన్టీయూ కి ప్రత్యేక గుర్తింపు

Hyd: దేశంలో మొట్టమొదటి టెక్నాలజీ యూనివర్సిటీ గా హైదరాబాదులోని JNTU కి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలను ఆదివారం గవర్నర్ ప్రారంభించారు.స్వర్ణోత్సవ వేడుకల పైలాన్ ను ఆవిష్కరించారు. క్యాంపస్ ఆవరణ పాత విద్యార్థులు (ఆలమ్ని) కోసం నిర్మించనున్న భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ… విద్యార్థులు సాంకేతిక నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు జేఎన్టీయూ ఎంతో సహకారం అందించనున్నారు. 50 ఏళ్లలో 20 లక్షల మందికి పైగా విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారని, అంత తిరిగి విశ్వవిద్యాలయంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. జేఎన్టియుహెచ్ వైస్ ఛాన్స్లర్ కట్ట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ… గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల లో ఇంజనీరింగ్ కాలేజ్, సుల్తాన్ పూర్ లో ఫార్మా కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం గర్వకారణమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వర్సిటీ రెక్టార్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.JNTUH లో చదివి పలు హోదాల్లో రిటైరయిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా JNTUH, దాని అనుబంధ కళాశాలల్లో ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు, ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు, రీసెర్చ్ జర్నళ్లను ప్రారంభించడంతో పాటు సెమినార్లు నిర్వహించారు.

బతుకమ్మ తెలంగాణకు గర్వకారణం

ప్రకృతి పట్ల ఆరాధనాభావం పెరిగేందుకు దోహదం పడే బతుకమ్మ పండుగ జరుపుకోవడం తెలంగాణ కు గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ తమిళ సై పేర్కొన్నారు. రాజ్ భవన్ ఆవరణలో ఆదివారం బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులు పలు రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker