హరితహారం పై సీఎం సంచలన నిర్ణయం… ఇక వారి జీతాల నుంచి కోత..
తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడానికి హరితహారానికి కౌశల్ తో పాటు మరింత నిధులను సమీకరించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసమే హరిత నిధి పేరుతో ప్రత్యేక నిధులను సేకరించి ప్రణాళికను రూపొందించింది.
దీనికి గాను ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హరిత నిధి ప్రణాళికను ముందుంచారు. ఎమ్మెల్యేలు మొదలుకొని ఉద్యోగుల దాకా ప్రతి నెల జీతం నుంచి కొంత నిధిని సేకరించాలని ఆలోచన చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జీతాల నుంచి ప్రతి నెల రూ.500, ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు జీతాలు నుంచి నెలకు రూ.100, ఇతర ఉద్యోగుల నుంచి రూ.25 చొప్పున అందరి అనుమతితో నిధులను సేకరించేల ప్రణాళిక రూపొందించారు. ఇదే కాకుండా బార్లు,వైన్స్, ఫెర్టిలైజర్ షాపులు,
ఇతర వ్యాపార లైసెన్స్ రెన్యూవల్ టైం లో ఏడాదికి వెయ్యి చొప్పున వసూలు చేసేలా నిబంధన తీసుకురానున్నారు. అలాగే భూముల కొనుగోలు రిజిస్ట్రేషన్ సమయంలో రూ.50 చొప్పున హరిత నిధిని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు.