lang="te"> హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ పూర్తిగా ప్రైవేటీకరణ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ పూర్తిగా ప్రైవేటీకరణ


ఏఏఐ వాటాను విక్రయించనున్న కేంద్రం
•మానీటైజషన్ ప్రక్రియ భాగం

న్యూఢిల్లీ: హైదరాబాద్ విమానాశ్రయం పూర్తిగా ప్రయివేటు పరం కానుంది.

ఇందులోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ఉన్న మైనార్టీ వాటాను కూడా మోడీ సర్కార్ అమ్మకానికి పెడుతుంది. ప్రభుత్వరంగ ప్రైవేటు సంస్థల వాటాలు, ఆస్తుల విక్రయానికి కేంద్రం కొత్తగా మానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేశంలోని నాలుగు కీలక విమానాశ్రయాలలో ఏఏఐకి కి ఉన్న మైనార్టీ వాటాను కూడా కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్, ముంబై విమానాశ్రయంలో 26 శాతం చొప్పున వాట, హైదరాబాద్ బెంగళూరు ఎయిర్ పోర్ట్ లోని 13 శాతం చొప్పున ఏఏఐ వాటాలను కలిగి ఉంది. ఈ విమానాశ్రయాల్లో వాటాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అమ్మకానికి పెడుతుందని సమాచారం. ఇందులోభాగంగా తొలుత బెంగళూర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లను పూర్తిగా ప్రైవేటీకరించం ఉంది. 13 విమానాశ్రయాల ప్రైవేటీకరణ ఇటీవలే ఈ బోర్డు ఆమోదం తెలిపింది. వీటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఏడు చిన్న విమానాశ్రయాలను, 6 పెద్ద విమానాశ్రయం కలపాలని భావించింది. ఇందులో భాగంగానే తిరుపతి, రారుపూర్ విమానాశ్రయం విలీనం చేయాలని యోచించింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, త్వరలోనే క్యాబినెట్ ఆమోదం లభించును నంది సమాచారం. నీతి ఆయోగ్ ఇటీవల అసెట్ మానిటైజేషన్ పైపులైను రూపొందించింది. ఇందులో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖలో రూ.20.782 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోభాగంగా వచ్చే 2025 నాటికి ఏఏఐ పరిధిలోని లేదా సంయుక్త వాటాలను కలిగిన 25 విమానాశ్రయాలను కార్పొరేటర్లకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు సంస్థలు ఏఏఐ సంయుక్త భాగస్వామ్యం కలిగిన రూ.10 వేల కోట్ల ఆస్తులను విక్రయించాలని నీతి ఆయోగ్ సూచించింది.