ఖమ్మం జిల్లా TRS నేతలపై రేవంత్ రెడ్డి ఫోకస్…
- కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సీతక్క చర్చలు
TPCC చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ లో బలమైన మార్పు వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు కొత్త ఉత్సాహం వస్తుంది.
రేవంత్ రెడ్డి పక్క వ్యూహంతో రాజకీయ అడుగులు వేయడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి దూరం అయిన ప్రతి వర్గాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ దగ్గరికి చేర్చుకునేందుకు భాగంగానే ప్రయత్నిస్తున్నారు. ఇక ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. ఇది ఆయనకు బాగానే ఇమేజ్ వస్తుంది.
ఇప్పుడు ఆయన జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఏ జిల్లాలో తమ పార్టీ వీక్ గా ఉందో వాటిపై పోకస్ పెట్టి ఇంతకుముందు తమ పార్టీలో పనిచేసి ఇప్పుడు వేరే పార్టీల వారిని తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించేందుకు రెడీ అవుతున్నారు రేవంత్. ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి కొందరు తమ పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పై ఫోకస్ పెట్టిన రేవంత్ ఇందుకు సీతక్క లో రంగంలోకి దింపారు. అయితే సీతక్క రీసెంట్ గా ఈ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ సెకండ్ గ్రేడ్ లీడర్లతో రహస్య భేటీ అయినట్లు సమాచారం.
దీంతో టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు సీతక్క అయినట్టు తెరుచుకున్న జిల్లా గులాబి నేతలు అలర్ట్ అయ్యి వారు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా ప్రముఖంగా కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ పేరు బలంగా వినిపించింది. అయినా సీతక్క తో రహస్యంగా కొంతమందిని తీసుకొని వెళ్లి మీట్ అయినట్టు తెలుసుకున్న ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఖమ్మంలో పెద్ద దుమారమే రేగింది. ఇక ఈయన తో పాటు మరికొందరు కూడా ఉన్నారని త్వరలోనే వారిని కూడా సస్పెండ్ చేస్తారని ప్రచారం సాగుతోంది.