ఆరో తేదీన సీనియర్,జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు రాత పరీక్ష
రాష్ట్రంలోని రెండు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆరవ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.TSPSC కార్యదర్శి అనితారామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పీవీ నరసింహారావు వెటర్నరీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ను నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు 5,888 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరికి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి హెచ్ఎండిఎ పరిధిలో లో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (పేపర్ వన్) (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ) మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 (సెక్రెట్రియల్ ఎమిలిటీస్ అండ్ కంప్యూటర్) పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు, మధ్యాహ్నం ఒకటి 15 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఫోటో గుర్తింపు కార్డు అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని.