TS: మహిళా యూనివర్సిటీలో 1740 డిగ్రీ సీట్లు

తెలంగాణ లో మహిళా విద్యకు దిక్సూచిల ఏర్పాటైన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్స్ యూనివర్సిటీలో ఈ ఏడాది 1,740 డిగ్రీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. కోటి మహిళా కళాశాలను వర్సిటీగా అప్డేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అనుబంధ కాలేజీలు లేకుండా ఒకే కాలేజీలో ఉన్న 1740 సీట్లు సాధించిన మహిళా అభ్యర్థులకు వర్సిటీ పేరుతో పట్టాలను జారీ చేశారు.

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 978 కాలేజీలో 4, 20,470 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 978 కాలేజీలకు అధికారులు అఫీలేషన్లను ఇచ్చారు. త్వరలోనే మరికొన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వనున్న నేపథ్యంలో సీట్లు సైతం కూడా పెరుగుతాయి.

Women University



మొదటి విడత కౌన్సిలింగ్ లో భాగంగా 1.44 లక్షల విద్యార్థులు దరఖాస్తులను ఇచ్చారు. వీరిలో 1‌.15 లక్షలకు పైగా వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. ఈనెల 6న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. 7వ తేదీ నుంచి రెండవ విడత అడ్మిషన్లను రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఎంసెట్ తొలి విడత ప్రవేశాలు ముగిసిన తర్వాత విద్యార్థుల చేరికతో దోస్త్ ప్రదేశాలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయి.

నాలుగేళ్లుగా డిగ్రీ కోర్సులో ఏటా సీట్లు పెరుగుతుండటం తో కోర్సులు, సబ్జెక్టుల కాంబినేషన్ల సంఖ్య సైతం కూడా పెరుగుతుంది. జీరో అడ్మిషన్ కాలేజీ ను మూసేసిన వాటిలో కూడా సీట్లకు కోత పెట్టిన ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నది. పలు కాలేజీల కొత్త కోర్సుల వైపు దృష్టి పెట్టడమే ఇందుకు ముఖ్య కారణం.

యూనివర్సిటీ- కాలేజీలు- సీట్లు

ఉస్మానియా – 361- 15750
కాకతీయ- 280- 117610
తెలంగాణ- 70- 34980
మహాత్మా గాంధీ- 84- 33460
పాలమూరు- 79- 32960
శాతవాహన- 92- 43370
తెలంగాణ మహిళా వర్సిటీ 1- 1740
జేఎన్టీయూ- 1- 60
ఎస్బిటెట్- 10- 540
మొత్తం- 978- 420470


కోర్సుల్లో సీట్ల పెరుగుదల వివరాలు

సంవత్సరము- సీట్లు- కోర్సుల కాంబినేషన్
2019- 383514- 174
2020- 407390- 501
2021- 408345- 501
2022- 420470- 501

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker