TSPSC: DAO 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

53 డిఏఓ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 17 నుంచి దరఖాస్తులు మొదలవుతాయి. సెప్టెంబర్ 6 వరకు అవకాశం ఉంటుంది. మొత్తం పోస్టులు 49,481.

డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏవో గ్రేడ్-2 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 53 పోస్టులను చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు  చేసుకోవచ్చని అని తెలిపారు. అప్లికేషన్ నమూనా TSPSC వెబ్సైట్లో ఉంటుందని తెలిపారు. 

TSPSC

మల్టీ జోన్ 1లో 28 పోస్టులు, మల్టీ జోన్ 2 లో 25 పోస్టులు ఉన్నాయని తెలిపారు. 18 నుండి 44 వయసు గల అభ్యర్థులు దరఖాస్తుకు చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం పోస్టులలో మహిళలకు 24, జనరల్ లో 29 పోస్టులు ఉన్నాయని తెలిపారు.


80,039 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 49,428 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇంకా మరో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి TSPSC గురువారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందుకు అర్హత గల అభ్యర్థులు ఆగ‌ష్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వివరాలు https:// www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించండి. ఈ నోటిఫికేషన్తో కలిపి ఇప్పటివరకు మొత్తం 49,481 పోస్టులకు అనుమతి ఇచ్చారు.

AMVI అప్లికేషన్ ప్రక్రియ వాయిదా

రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తులను టిఎస్పీఎస్సీ తాత్కారికంగా నిలిపివేసింది. కొన్ని టెక్నికల్ సమస్యలతో ఈ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను తెలుపుతామని చెప్పారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker