lang="te"> Kakatiya University Distance Education Admissions 2022 Apply at SDLCE KU - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

Kakatiya University Distance Education Admissions 2022 Apply at SDLCE KU

Kakatiya University Distance Education Admissions 2022 Apply at SDLCE KU: వరంగల్ కాకతీయ యూనివర్సిటీ (KU) ఆధ్వర్యంలో ‘స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (ASDLCE) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సెమిస్టర్ లు ప్రకారం దూర విద్యా విధానంలో నిర్వహిస్తారు. ఆన్లైన్ సెషన్స్ ద్వారా భోధన ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ కోర్సులను గరిష్టంగా ఆరేళ్లలో, డిగ్రీ కోర్సులను తొమ్మిదేళ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. వయోపరిమితి నిబంధనలు లేవు.

డిగ్రీ కోర్సులు: బిఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ప్రోగ్రాములు ఉన్నాయి. ఒక్కో కోర్సు కాలం మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. బీఎస్సీ మేథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్/12వ తరగతి ఉత్తరులై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కోర్సులకు ఏ గ్రూపు అభ్యర్థులైన అర్హులే. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీకాం (కంప్యూటర్స్), బీబీఏ, బీఎల్ఐఎస్సీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదవాలి. మిగిలిన వాటికి తెలుగు/ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.

బీఏ గ్రూపులు: హెచ్ పీపీ, ఎస్ పీపీ,
బీకాం గ్రూపులు: జనరల్, కంప్యూటర్స్
బీఎస్సీ సబ్జెక్టులు: మేథమెటిక్స్, స్టాటిటిక్స్, కంప్యూటర్ సైన్స్.

పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంఎస్ డబ్ల్యూ,ఎంటీఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క కోర్సు కాలం రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఎమ్మెస్సీ స్పెషలైజేషన్ అనుసరించి సైన్స్ డిగ్రీ/ బీఏ (మేథ్స్)/ బీఎస్సీ (ఎంపీసీ), మిగిలిన కోర్సులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లాంగ్వేజెస్ లో ఎంఏ ప్రవేశానికి సంబంధించిన లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ చదివి ఉండాలి. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఒక సంవత్సరం. ఇందులో రెండు సెమిస్టర్ ఉంటాయి. బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. మాస్టర్ ఆఫ్ జర్నలిజం వ్యవధి ఏడాది.ఇందులో రెండు సెమిస్టర్ ఉంటాయి. బీసీజే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎంఏ స్పెషలైజేషన్లు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ,హిస్టరీ, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్.

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్: మేథ్స్, సైకాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్

ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.400/- దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200/-

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10

వెబ్ సైట్: sdlceku.co.in