సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు ‘పథకానికి చట్టబద్ధత కల్పించడం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రతియేటా బడ్జెట్లు నిధులు కేటాయిస్తున్న తరహాలో ఈ పథకానికి కూడా అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకానికి నిధులు విడుదల చేయాలని భావించినా, పటిష్ఠంగా అమలు కావాలంటే చట్టబద్ధత కల్పించడం ఉత్తమం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై లోతుగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింప పడి చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధత ఉన్నందునే ప్రతియేటా ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తుంది. వాటిని సమర్థవంతంగా పారదర్శకంగా ఖర్చు చేయనున్నట్లు భరోసా కల్పించింది. ఏ అవసరాల కోసం నిధులు కేటాయించిందో,వాటిని అందుకోసం ఖర్చు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒకవేళ ఏదేనీ పరిస్థితుల్లో ఆ నిధులను వినియోగించని పక్షంలో వాటిని ఇతర అవసరాలకు మళ్ళించడానికి వీలు ఉండదు. ఇప్పుడు దళిత బంధు విషయంలో అదే విధానాన్ని అవలంభించాలని అనుకుంటుంది.
ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ లో ఈ మేరకు కసరత్తు మొదలైనట్టు సచివాలయ వర్గాలు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన వారితో సహా రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందించనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత క్రమంలో కడు పేదరికంలో ఉన్న కుటుంబాలకు నుంచి మొదలుపెట్టినట్లు వివరించారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని గరిష్టస్థాయిలో 15 దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా సహాయం అనుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఏటా బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు వివరించారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా చట్టబద్ధత కల్పించే తీరులో అధికారులు పేపర్ వర్క్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ పథకం కింద అర్హులను ఎంపిక చేయడానికి ముసాయిదా మార్గదర్శకాలు తయారైన రాష్ట్రంలో దళిత కుటుంబానికి వర్తింపజేయడం అందున అసెంబ్లీ సమావేశాలు తర్వాత స్పష్టమైన ఉత్తర్వులు జరుగుతాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.