మెదక్ జిల్లాలో అధికార పార్టీకి చెక్, పదుల సంఖ్యలో సర్పంచులు జంప్ కారణం ఇదే



అసలే సర్పంచులు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా వారైతే బాధ్యత.. ఖజానాలో డబ్బులు లేక ఉన్నా అప్పులు చేసి మరీ అభివృద్ధి బాటలు వేస్తారు. అయితే అప్పులు అభివృద్ధి సర్పంచుల పాలిట శాపంగా మారింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తమ రాజకీయ భవిష్యత్తు కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్న తమకు న్యాయం జరగలేదు అంటూ పార్టీలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికార టిఆర్ఎస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో కొంతమంది సర్పంచులు తాను చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు సొంత పార్టీలు గెలిచినా వారు సైతం ఇదే బాట పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలోని వైకుంఠ దామాలు నిర్మించాలని సర్పంచులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని సర్పంచుల పై బాధ్యత పెట్టింది. అయితే కొన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు పూర్తి కాక వాటికి సంబంధించిన బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో వీటిని నిర్మించేందుకు వచ్చిన పలువురు సర్పంచులు కాంట్రాక్టర్ గా మారారు. ఇందుకోసం సొంత నిధులు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వారికి బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో కొంత మంది ఆందోళన బాట పట్టారు. బిల్లుల కోసం అధికారులు నేతల చుట్టూ తిరిగిన ఫలితం మాత్రం ఏమీ కనిపించలేదు.

ఇందుకోసం మెదక్ జిల్లాలో అక్కన్నపేట మండలం పలువురు సర్పంచ్ పార్టీ మారేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకోవడంతో పాటు టిఆర్ఎస్ భవిష్యత్తుపై అంచనా వేస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్లేందుకు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

దీంతో సర్పంచులు గజ్వేల్ కాంగ్రెస్ దళిత దండోరా సభలో ఆ పార్టీ కండువా కప్పుకునే ఎందుకు సిద్ధమయ్యారు. కాగా మండలంలోని 32 మంది సర్పంచులు ఉండగా అందులో 28 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. దీంట్లో సుమారు 21 మంది సర్పంచులు అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొంతమంది కూడా ఇతర పార్టీలో వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో తో సర్పంచుల పార్టీ మార్పు పై మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker