ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రోత్సహిస్తున్నాం- మంత్రి కేటీఆర్



HYD: దేశంలోనే తొలిసారిగా డ్రోన్లు ద్వారా మందులు సరఫరా చేస్తామని. ఈరోజు చారిత్రాత్మక దినమని మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని,సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థం అని చెబుతున్నారు.

వికారాబాద్ లో ‘మెడిషన్ ఫ్రం స్కై’ప్రాజెక్టు మంత్రి కేటీఆర్ తో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమర్జింగ్ టెక్నాలజీ ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. అధునాత టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయవచ్చని వెల్లడించారు. ఆరోగ్య రంగం లోనే కాదు. అనేక రంగాల్లో డ్రోన్ వాడవచ్చా అని తెలిపారు.

మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడతామని
అమ్మాయిలను వేధించే వాళ్లకు డ్రోన్ చప్పుళ్ళకి భయపడతారని వెల్లడించారు. మైనింగ్ ఇలాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాల్లో కట్టడి చేయవచ్చు అన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్ వర్సిటీ గా మార్చాలని కేంద్ర మంత్రి కోరారు. వికారాబాద్ కొత్త కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker