తెలంగాణ లోని సర్కారును బడులు రీ ఓపెన్
తెలంగాణ లోని సర్కారును బడులు రీ ఓపెన్……తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. రీ ఓపెనింగ్ పై సీఎం కేసీఆర్ గారు విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి సర్కారు బడులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాప్తి కారణంగా బడులు మూసిన తెలిసిందే. బడులు రీ ఓపెన్ చేయొచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖకు ఇచ్చిన నివేదిక ప్రకారం సీఎం కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంవత్సరం పున:ప్రారంభం నేపథ్యంలో కరోనా వ్యాప్తి నియమ నిబంధనలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కరోనా కేసులో తగ్గుముఖం పట్టాయి.