పదోన్నతులు లేక ఉపాధ్యాయులకు అన్యాయం…

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కి వినతి.

గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతుల విషయం మర్చిపోవాలి పరిస్థితి కనపడుతుంది అన్నారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు, డివి రావు రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాముల వారి దర్శనానికి వచ్చిన గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పాల్వంచ లో మాట్లాడుతూ 2017 సంవత్సరం గుర్తించబడిన 1191 పోస్టుల ఊసే లేకుండా పోయిందన్నారు. ప్లేన్ ఏరియా జిల్లాలో అప్ గ్రేడ్ చేసిన పాఠశాలల్లో 330 పోస్టుల భర్తీ జరగకపోగా, అయా పోస్టులు విద్యా  వాలంటీర్స్‌తో నెట్టుకొస్తున్నారని తెలిపారు.

601 పోస్టులకు నేరుగా నియామకం చేయాల్సి ఉండగా వాటిని భర్తీ చేయడం లేదన్నారు. జిల్లాలోని కన్వర్టెడ్‌ ఆశ్రమ పాఠశాలలో పోస్టులు మంజూరు చేయకుండా డిప్యుటేషన్ తోనే నెట్టుకొస్తున్నారు అని తెలిపారు. స్కూలు సజావుగా సాగనీయకుండా కన్వర్ట్ పాఠశాలలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

న్యాయంగా మాకు రావాల్సిన పదోన్నతులు రానీయకుండా అధికారులు అడ్డుపడితే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనకాడబోమని నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికైనా  గిరిజన ఉపాధ్యాయుల పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయల ను కన్వర్టెడ్‌ పాఠశాలలో నియమించి ఆ పాఠశాలల్లో సజావుగా సాగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు, కారం సర్వేశ్వర దొర, శంకర్ నాయక్, రఘు, శంకర్ నాయక్, నరసింహారావు, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker