lang="te"> TS Inter Calendar 2021-22: ఇంటర్ విద్యాసంవత్సరం ఖరారు పరీక్ష విధానంలో కీలక మార్పులు - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

TS Inter Calendar 2021-22: ఇంటర్ విద్యాసంవత్సరం ఖరారు పరీక్ష విధానంలో కీలక మార్పులు


తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్లైన్ లో నిర్వహించిన తర్వాత లు కలిపి 220 పని దినాలు తో ఈ విద్యా సంవత్సరానికి ఖరారు చేసింది. దసరా ఆదివారం తో కలిపి ఐదు రోజులు, సంక్రాంతి జనవరి 13 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ విధానం లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. అర్థ సంవత్సర, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రెటరీ మాట్లాడుతూ అకాడమిక్ క్యాలెండర్ ని అందరూ తప్పకుండా పాటించాలని సూచించారు. ఉల్లంఘించిన కళాశాలల యాజమాన్యాల పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్లికేషన్ రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదీలు:
డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.

ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్.

మార్చి 23 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు.

మే చివరి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.

ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.

జూన్ 1న ఇంటర్ కాలేజ్ పున:ప్రారంభం.