కలిసికట్టుగా గణేష్ వేడుకలు: SP రంజన్ రతన్ కుమార్



శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న SP రంజన్ రతన్ కుమార్..

గద్వాల్ అర్బన్: ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే గణేష్ వేడుకలను కలిసికట్టుగా జరిపించాలని, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని SP రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు.

గద్వాల్ గంజిపేట లో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ అధ్యాత్మిక విలువలు కాపాడుకోవడానికి ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు. విగ్రహాలను ప్రతిష్టించేందుకు పోలీసు శాఖతో పాటు విద్యుత్ శాఖ అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆన్లైన్ ద్వారా తీసుకోవాలని తెలిపారు.
(http:///policeportal.tspolice.gov.in)

నది అగ్రహారం, బీచుపల్లి వద్ద నిమజ్జనానికి సంబంధించి, పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రంగస్వామి, సిఐలు షేక్ మహబూబ్ పాషా, సూర్య నాయక్, పుర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్లో ఎస్సై లు, పెద్దలు పాల్గొన్నారు.

Read more: AP Vinayaka Chavithi News: వినాయక చవితి ఉత్సవాల పై హైకోర్టు సంచలన తీర్పు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker