నాగశౌర్య భార్య ద్వారా తెలుసుకున్న 5 ఇంటీరియర్ డెకర్ టిప్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల్లో అతి తక్కువ కాలంలో ఫేమస్ అయిన ఒక హీరో ఎవరంటే నాగశౌర్య. నటించిన సినిమాలు కొన్ని అయినా కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తనదైన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన వారిలో నాగశౌర్య కూడా ఒకడు. కొంతకాలంగా నాగశౌర్యకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మొదట నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నాడని, నెక్స్ట్ నాగశౌర్య అస్వస్థతకు గురై హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని మరొక న్యూస్ ఇలా సోషల్ మీడియాలో ఇతనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. నాగశౌర్య ఒక ఇంటి వాడయ్యాడని, ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరని అభిమానులు నెట్ ఇంట్లో తెగ వెతికేస్తున్నారు.
ఇంతకీ నాగశౌర్య పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరంటే? బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయినా అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈనెల 20వ తారీకున 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులోని ఒక హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ అమ్మాయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంగళూరు దగ్గరలోని, కుందాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈమె ఒక ఇంటీరియర్ డిజైనర్.
ఈ ఫీల్డ్ లో ఈమెకు చాలా టాలెంట్ ఉంది. ఈమె టాలెంట్ ద్వారా ఉమెన్ అచీవర్స్ లో ఒకరుగా గుర్తింపు పొందారు. ఈమె న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుంచి సర్టిఫికెట్ పొందింది. వ్యవస్థాపకత మరియు మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కూడా సొంతం చేసుకుంది. అనూష శెట్టి డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డు పొందింది. 2021 సంవత్సరంలో ఇండియాస్ టాప్ టెన్ ఇంటీరియర్ డిజైనర్స్ 2021 అవార్డుని కూడా సొంతం చేసుకుంది.
ఈమెతో కొంతకాలంగా నాగచౌర్యకి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి, కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో నవంబర్ 20వ తేదీన బెంగళూరులోని ఒక హోటల్లో ఘనంగా విరి వివాహం చేసుకున్నారు.
నాగశౌర్య భార్య నుంచి తెలుసుకోవాల్సిన ఇంటీరియర్ డెకరేషన్ కి సంబంధించిన ఐదు రకాల చిట్కాలు గురించి తెలుసుకుందాం.
1-హైలెట్ చేయడానికి ఫాల్స్ సీలింగ్:
ఫాల్స్ సీలింగ్ మీ స్థలానికి, గదికి మరింత కోణాన్ని, అందాన్ని జోడిస్తుంది. ఆ సీలింగ్ లో వాటి మధ్యలో కొన్ని ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఉన్న గది పెద్దదిగా, విశాలంగా, అందంగా కనిపిస్తుంది. మీ ఇల్లు కూడా అందంగా ఉండాలంటే కచ్చితంగా ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసుకోండి.
2-సహజ కాంతి:
మీరు ఏ గదిని అయితే అందంగా డెకరేట్ చేయాలనుకుంటున్నారు ఆ గది లోపలికి ఎల్లప్పుడూ సూర్యకాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. సూర్యకాంతి మనకు విటమిన్ డి ని అందిస్తుంది. అలాగే స్థలాన్ని, మనం ఉండే గదిని కూడా ప్రకాశవంతం చేస్తుంది.
3-గ్యాలరీ వాల్:
మీరు ఏ గదినైతే అందంగా అలంకరించాలనుకుంటున్నారో ఆ గదిలో ఏదైనా కాలి గోడ ఉంటే 9 ఫోటోలను సెలెక్ట్ చేసి వాటిని గోడపై అమర్చిన తర్వాత ఆ గోడకు ముందుగానీ, ప్రక్కకు గాని, ప్రేమ్ కు ఎగువన గాని ఒక స్పాట్లైట్ను ఏర్పాటు చేయండి. గోడకు మరింత మెలకువలను జోడిస్తుంది ఈ లైట్.
4-కార్పెట్ బెడ్:
మీ పడకగది నీ అందంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మరింత సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే రంగు స్కీమ్ ని ఏర్పాటు చేసుకుని, అబ్స్ట్రాక్ట్ కార్పెట్ సెలెక్ట్ చేయండి. దీన్ని మీ బెడ్ కు టేపింగ్ ఎండ్ వైపు ఉంచండి. మోనోటని-బ్రేకింగ్ రన్నర్ తో స్పేస్ కు మరింత నిర్మాణాన్ని జోడించండి. చాలా అందంగా తయారవుతుంది మీ పడకగది.
5-గ్రీన్ వాల్స్:
మీ ఇంటిని మీరు అందంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు, మీ ఇల్లు అందరికీ అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు బాల్కనీ పై కూడా కొంచెం దృష్టి పెట్టాలి. బాల్కనీ లో గోడలపై గ్రీన్ కలర్ కి సంబంధించిన ఫ్రేమ్స్, సీలింగ్ పై లైటింగ్ ఎఫెక్ట్ ఏర్పాటు చేసుకొండి. సూర్యకాంతి లోపలికి వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే బాల్కనీ అంతా ప్రకాశంవంతంగా అందంగా కనిపిస్తుంది.
ఈ టిప్స్ ని స్టార్ భార్య, నాగశౌర్య భార్య అనూష శెట్టి ద్వారా తెలుసుకున్నాం. ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మన ఇంటిని మనం చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.