Samantha: ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ పోస్ట్

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నారు. సమంత కొంతకాలంగా సోషల్ మీడియా కి దూరంగా ఉంటున్నారు. ఈ టైంలో సమంత ఆరోగ్యం పై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ సమంత ఇంతవరకు ఈ వార్తలపై ఎలాంటి ప్రతిస్పందన లేదు.

మొదటిసారిగా తను మాట్లాడుతూ ఆమె ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లు దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతకు ఏమైంది? అంటూ తన అభిమానులు తన గురించి నెట్ లో వెతుకుతున్నారు.

యశోద మూవీకి సంబంధించి సమంత మాట్లాడిన మాటలు–
యశోద ట్రైలర్ కి మీ రెస్పాన్స్ చూసి చాలా సంతోషం అనిపించింది. మీ అందరి ప్రేమ ,అనుబంధమే లైఫ్ నాకు ఇస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. కొన్ని నెలల నుంచి మయోసైటిస్ అనే కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా రికవరీ అయ్యాక మీతో చేద్దామనుకున్నాను. కానీ నేను అనుకున్న దాని కంటే ట్రీట్మెంట్ కి ఎక్కువ సమయం పడుతుంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లలేమని రియలైజ్ అయ్యాను.

ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ పోస్ట్-త్వరలోనే కోలుకుంటా అంటున్న సమంత
ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ పోస్ట్-త్వరలోనే కోలుకుంటా అంటున్న సమంత

త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ప్రస్తుతం ఫిజికల్ గా, ఎమోషనల్ గా మంచి రోజులు, అలాగే చెడు రోజులు కూడా ఉన్నాయి. నేను వీటన్నింటినీ హ్యాండిల్ చేయలేనేమో అని అనుకున్నా సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోరుకునే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ఆశిస్తున్నాను” లవ్ యు”అంటూ తన ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంది సమంత. ఈ పోస్ట్ చూసిన వారందరూ, తన అభిమానులందరూ త్వరగా కోలుకోవాలి అంటూ ఆశిస్తున్నారు.

Samantha సమంతకి సోకిన అరుదైన వ్యాధి- ఆ వ్యాధి లక్షణాలు ఏంటి?

ఈ వ్యాధి నుంచి నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు నటించింది.అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ తో ఎన్నో సినిమాలు నటించారు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

అటు పర్సనల్ లైఫ్ లో గాని, ఇటు ఆరోగ్య విషయంలో గాని బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ తన అభిమానుల కోసం షేర్ చేసుకుంది. సమంత నటిస్తున్న కొత్త మూవీ యశోద. ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించి వస్తున్న రెస్పాన్స్ చూసి తనకు చాలా ఆనందంగా ఉందని ఈ ఆనందం ద్వారా తన బాధను మర్చిపోయి త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker