Naga shaurya: హీరో నాగ శౌర్య పెళ్లి- అమ్మాయి ఎవరంటే?

Naga shaurya: టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించి న హీరో ,హీరోయిన్స్ లో కొందరు ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా కష్టపడి పైకి వచ్చినవారు ఉన్నారు. మరికొందరు సపోర్ట్ తీసుకుని ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు అతి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయిన హీరో హీరోయిన్స్ ఉన్నారు. ఇలాంటి వారిలో నాగశౌర్య కూడా ఒకరు.

ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అతి తక్కువ కాలంలో ఫేమస్ అయిన వారిలో ఒకడు. నాగశౌర్య తను ఇప్పటివరకు నటించిన సినిమాల ద్వారా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈయనకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడని, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరని? ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హీరో నాగ శౌర్య పెళ్లి. అమ్మాయి ఎవరంటే?
హీరో నాగ శౌర్య పెళ్లి. అమ్మాయి ఎవరంటే?

అయితే త్వరలోనే నాగశౌర్య ఒక ఇంటివాడు కాబోతున్నాడని, బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీరి పెళ్లికి ఇంటిలో వాళ్లు కూడా ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 20వ తారీఖున 11 గంటల 25 నిమిషాలకు వీరి వివాహం బెంగళూరులో ఒక హోటల్లో ఘనంగా జరగనుంది.

ఇప్పటికే నాగశౌర్య ఇంటిలో పెళ్లి సందడి మొదలయ్యి శుభలేఖలు కూడా పంచుతున్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే ఆహ్వానితులను భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లికి రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ మెంబర్స్ ఆహ్వానితులను కోరుతున్నారు.

ఇది ఇలా ఉండగా నాగ శౌర్య చేసుకునే అమ్మాయి ఎవరు? ఇంతకు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? అని అతని అభిమానులు సోషల్ మీడియా లో వెతుకుతున్నారు. ఈ అనూష శెట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంగళూరు దగ్గరలోని కుందాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈమె ఇంటీరియర్ డిజైనర్. ఈ ఫీల్డ్ లో ఈ మాకు చాలా టాలెంట్ ఉంది. ఆమె టాలెంటుకు గుర్తింపుగా ఉమెన్ అచివర్స్లో ఒకరుగా గుర్తింపు పొందారు.

2019-2020 లో ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఈమె సొంతం చేసుకున్నారు. ఒక ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయింది. ఈమెతో కొంతకాలంగా నాగశౌర్యకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళ ఇద్దరి పెళ్ళికి వాళ్ళ పెద్దలు కూడా ఒప్పుకున్నారు.

హీరో నాగ శౌర్య పెళ్లి న్యూస్ తెలియగానే సెలబ్రిటీస్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పెళ్లి ఈనెల 20వ తారీఖున 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులోని ఒక హోటల్లో ఘనంగా జరుగుతుంది.

అనూష శెట్టి Latest Photos:

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker