Pushpa 2(The Rise): పుష్ప -2 షూటింగ్ ప్రారంభం, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటున్న బన్నీ

Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ అంటే తెలియని వ్యక్తి లేడు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అల్లు అర్జున్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. తన డ్రెస్సింగ్ స్టైల్ తో, తన డాన్స్ తో ఎంటర్టైన్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తిలో అల్లు అర్జున్ కూడా ఒకడు.

ఇతను నటించిన పుష్ప 1 మూవీ సూపర్ హిట్ అందుకుంది. అత్యధిక కలెక్షన్ కూడా అందుకుంది ఈ మూవీ .ప్రస్తుతం పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాదులో ఉన్న రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రత్యేకమైన సెట్ లో పుష్ప 2 కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు.

పుష్ప -2 షూటింగ్ ప్రారంభం, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటున్న బన్నీ
పుష్ప -2 షూటింగ్ ప్రారంభం, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటున్న బన్నీ

ఈ సినిమా షూటింగ్లో త్వరలోనే బన్నీ పాల్గొంటున్నాడని సమాచారం. ఎక్కువ సమయం తీసుకోకుండా షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఈ మూవీలో కొన్ని పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన సునీల్, అనసూయ పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ పాత్రలు సెకండ్ పార్ట్ లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

ఈ సినిమాలోకి నటించడానికి కొంతమంది కోలీవుడ్ నుండి, బాలీవుడ్ నుంచి స్టార్లను ఎంపిక చేశారు. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

ఫహాద్ ఫాజిల్ పాత్ర ఈ మూవీలో మరింత పాపులర్ గా కనిపించనుంది. ఇక హీరోయిన్ రష్మిక విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో తన నటనతో, తన డాన్స్ తో అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. మరి పుష్ప పార్ట్ 2 కు సంబంధించి రష్మిక తో పాటు మరో హీరోయిన్ ని కూడా ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

పుష్ప పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్ లో కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేసుకుని విడుదల కావాలని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేయాలని షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.

రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సెట్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా షూటింగ్ చేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker