1980-1990 ఫిల్మ్ స్టార్స్ రీయూనియన్ ఈవెంట్-హాజరైన సెలబ్రిటీస్

స్కూల్ విద్యార్థులు గానీ, కాలేజీ స్టూడెంట్స్ గానీ కొన్నేళ్ల తర్వాత రీయూనియన్లు ఏర్పాటు చేస్తారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పి ఎక్కడెక్కడో స్థిరపడిన విద్యార్థులు మళ్లీ కలుసుకుని స్కూల్, కాలేజ్ డేస్ ను నెమరువేసుకుంటారు. అచ్చం అలానే సినీ ఇండస్ట్రీలోని తారలు సైతం ఇలాంటి కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించుకున్నారు. 1980వ దశకంలో చిత్ర పరిశ్రమలో మెరిసిన సెలబ్రిటీలు మళ్లీ కలిశారు.

ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటుల సమ్మేళనం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా మరోసారి వాళ్లంత కలిసి ఆనాటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.కొన్నాళ్లుగా 1980వ దశకం హీరో హీరోయిన్లంతా క్లాస్ ఆఫ్ ఎయిటీస్ గా అందరూ కలిసి ఎంజాయ్ చేయడం చూస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో 80వ దశకంలో మెరిసిన తారలంతా కలిసి ఒక చోట చేరి…ఈసారితమ దశాబ్దాల నాటి స్నేహాన్ని, ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు జరుపుకునే ఈ రీ యూనియన్ వేడుకకు అనేకమంది తారలు తరలివస్తారు.ఇందుకు ముంబై వేదికగా మారింది.

11వ రీయూనియన్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ చిరంజీవి అనిల్ కపూర్ రమ్య కృష్ణ శరత్ కుమార్
11వ రీయూనియన్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ చిరంజీవి అనిల్ కపూర్ రమ్య కృష్ణ శరత్ కుమార్

ఈ 11వ రీయూనియన్ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, పూనమ్ ధిల్లాన్ హోస్ట్ చేశారు. ఈ వేడుకకు దక్షిణాది నుంచి దాదాపు 25 మంది సెలబ్రిటీలు హాజరయ్యారు…ఈ 11వ రీయూనియన్ ముంబైలో జరగడంతో మహారాష్ట్ర సాంప్రదాయాలను పాటించారు. మహారాష్ట్రలోని స్థానిక వంట రుచులను తయారు చేశారు. వేదిక వద్ద జరిగిన ప్రోగ్రామ్ లో అనేక మంది నటీనటులు కలిసి మాట్లాడుకున్నారు.

ఆనాటి అనుభవలాను పంచుకున్నారు.అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూనమ్ ధిల్లాన్ రూపొందించిన కొన్ని సరదా ఆటలు, క్విజ్ పోటీలలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సౌత్ నుంచి చిరంజీవి, శరత్ కుమార్, భాగ్యరాజ్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ, మధు తదితరులు పాల్గొన్నారు.ఈసారి కొత్త థీమ్ దుస్తుల్లో సెలబ్రిటీలు మెరిశారు.

కరోనా కారణంగా.. అయితే 1980వ దశకానికి చెందిన తారలంతా ప్రతి సంవత్సరం ఆత్మీయ కలయిక వేడుక జరుపుకోవాలనే కాన్సెప్ట్ ను ముందుగా సుహాసిని మణిరత్నం ప్రారంభించారు. అందుకు అనుగుణంగా 2009 నుంచి ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ రీయూనియన్ చివరిసారిగా 2019లో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగింది. ఆ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో 2020, 21లలో ఈ వేడుకలు నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 11వ రీయూనియన్ ను ఏర్పాటు చేసి ఇలా సందడి చేశారు..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker