Ram Charan: 10 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ డ్యూయెట్ సాంగ్.

Ram Charan:దర్శకుడు శంకర్ ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేశాడు. శంకర్ సినిమాలలో పాటలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలలో పాటలకు విజువల్స్, గాని లొకేషన్స్ కానీ చాలా గ్రాండ్ గా ఉంటాయి. పాటను గ్రాండ్గా చిత్రీకరిస్తారు. దర్శకుడు శంకర్ అయితే పాటల కోసం లొకేషన్స్కు ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టి, ఆయన ఎక్కడ సాంగ్ తీయాలని అనుకున్నాడో ఆ స్థలానికి వెళ్లి సాంగ్ షూటింగ్ చేస్తారు.

శంకర్, రామ్ చరణ్ కలిసి RC15 పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోని సాంగ్ కోసం లక్షల కాదు, ఏకంగా10 కోట్ల బడ్జెట్తో పాటను షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. శంకర్ ఒకసారి అనుకున్నాడు అంటే, ఏది ఏమైనా ఆయన అనుకున్న విధంగానే సినిమాలు పూర్తి చేస్తారు. రాంచరణ్ తో కలిసి తీయబోతున్న పాన్ ఇండియా సినిమాను షూటింగ్ న్యూజిలాండ్ లో చేస్తున్నారు.

RC15 Pan India movie
RC15 Pan India movie

అంటే 10 కోట్ల ఖర్చుతో తీయబోయే పాట కూడా న్యూజిలాండ్ లోనే చిత్రీకరిస్తారు, అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటించబోయే పాన్ ఇండియా సినిమా షూటింగ్స్ న్యూజిలాండ్లో ఈనెల 20 నుండి డిసెంబర్ 2 వరకు జరుగుతున్నాయి.

హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుంది. 10 కోట్ల ఖర్చుతో తీయబోతున్న పాట రామ్ చరణ్, అద్వానీల డ్యూయెట్ సాంగ్ అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయినా బాస్కో మార్టిన్ ఈ పాటకు డ్యాన్స్ ను రూపొందిస్తున్నారు.

Ram Charan and kiara Advani
Ram Charan and kiara Advani

సంగీత దర్శకుడు తమన్, దిల్ రాజ్, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం పొలిటికల్ యాక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను 2023 చివర్లలో అంటే వచ్చే డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఇక అయితే ఈ సినిమాలో 10 కోట్ల ఖర్చుతో తీయబోతున్న పాట ఏది అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక ఈ సినిమా కోసం, అలాగే 10 కోట్లతో తీయబోతున్న పాట కోసం చరణ్ అభిమానులు వేసి చూస్తున్నారు. 10 కోట్లు ఖర్చుపెట్టి తీయబోతున్న పాట ఏంటో? అలాగే పొలిటికల్ యాక్షన్ సినిమా అన్నారు కదా! ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పొలిటికల్ యాక్షన్ సినిమాలలో రామ్ చరణ్ నటించే మొదటి సినిమా. ఇప్పటివరకు ఎప్పుడూ రాంచరణ్ పొలిటికల్ యాక్షన్ తరహాలో వచ్చే సినిమాలు చేయలేదు. ఇక ఈ సినిమాలో ఎలా ఉంటాడో,? సినిమాను ఏ విధంగా రూపొందిస్తున్నారో? 10 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న డ్యూయెట్ సాంగ్ ఎలా ఉంటుందో? పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా నటించబోతున్నాడో? తెలియాలంటే! వేచి చూడక తప్పదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker