Prabhas: ప్రభాస్ తన తలను హైడ్ చేయడానికి కారణం ఏంటి?

ప్రభాస్ లుక్ సినిమా సినిమాకు మారుతూనే ఉంది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యాంలో ప్రభాస్ డిఫరెంట్ స్టైల్ కనిపించాడు. అయితే తాజాగా ప్రభాస్ ఎక్కడకు వెళ్లినా కూడా… క్యాప్ కనిపిస్తున్నాడు. అయితే ఈ క్యాప్ వెనుక ఉన్న రహస్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేద.

ప్రభాస్ తన తలను హైడ్ చేయడానికి కారణం ఏంటి?

ఆరాడుగల అందగాడు,ప్రభాస కటౌట్ చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు. మిర్చీ, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ , వర్షం, బాహుబలి వంటి మూవీస్ లో ప్రభాస్‌ను చూసి ఆయన హైట్ వెయిట్‌కు అంతా షాక్ అయ్యారు.అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ స్టైల్లో బాగా మార్పులు వచ్చాయి. ఫేస్ కూడా చాలా మారిపోయింది. సాహోలో కాస్త పర్వాలేదనిపించినా.. రాధే శ్యాం మూవీస్ లో మాత్రం ప్రభాస్ లుక్ పై విమర్శలు వచ్చాయి.

ప్రభాస్‌ను అలా చూసి ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్రభాస్ పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి పెద్ద మూవీస్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రంలో వేరే వేరే కథలతో తెరకెక్కుతున్నాయి, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది.అయితే ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువగా తలకు క్యాప్ పెట్టుకొనే ఉన్నాడు.

ట్రైలర్ విడుదలకు, పోస్టర్ విడుదలకు ప్రి విడుదలకు ఈవెంట్ ఇలా కార్యక్రమం ఏదైనా సరే.. ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకొనే కనిపిస్తున్నాడు.తలకు క్యాప్ లేకుండా ప్రభాస్ అస్సలు కనిపించడం లేదు, ఎక్కడ చూసినా తలకు క్యాప్ గానీ.. క్లాత్ గానీ చుట్టుకొని కనిపిస్తున్నాడు. హెయిర్ కనిపించకుండా ప్రభాస్ తన స్టైల్ మెయింటెన్ చేస్తున్నాడు.

దీంతో ప్రభాస్ ఎందుకిలా చేస్తున్నాడంటూ ఆయనపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి.ప్రభాస్ క్యాప్ పెట్టుకోవడం వల్ల అసలు ఏమాత్రం బాగోలేదని, వింతగా కనిపిస్తున్నాడని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఎందుకు మా హీరో ఇలా క్యాప్ పెట్టుకుని బయటకు వస్తున్నాడు అంటూ కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కృష్ణం రాజు చనిపోయినప్పుడు కూడా ప్రభాస్ అంత్యక్రియల్లో క్యాప్ తోనే కనిపించేవాడు.

ఆ తర్వాత జరగిన సంస్మరణ సభకు కూడా ప్రభాస్ క్యాప్‌తోనే కనిపించాడు. ఇలా ఒక్కసారి రెండుసార్లు కాదు ప్రభాస్ ఎన్నిసార్లు బయటకు వచ్చినా ఇలా ఒక వింత క్యాప్ తోనే కనిపించేవాడు. అయితే ఆ వింత క్యాప్ పెట్టుకోవడం వెనుక కూడా ఒక రహస్యం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలే. ప్రభాస్ ప్రస్తుతం అనేక మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఒక్కొక్క చిత్రం కోసం ఒక్కొక్క హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాల్సి వస్తోంది.ఆ హెయిర్ స్టైల్ తో ఉన్న లుక్స్ బయటకు అవ్వకుండా ప్రభాస్ తన జుట్టుకు ఈ క్యాప్ పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆయన స్టైల్స్ ముందే బయటకు వచ్చేవి. మూవీ యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం కంటే ముందే ప్రభాస్ లుక్ బయటకు వచ్చేసేది.

అందుకే తన స్టైల్ బయటపడకుండా ప్రభాస్ ఈ విధంగా క్యాప్ మెయింటెన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker