Rashmika Mandanna:కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ పై తన స్పందన తెలిపిన రష్మిక
అతి తక్కువ చిత్రాల తోనే స్టార్ డం సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో రష్మిక మందన కూడా ఒకరు. తనదైన నటనతో, తన అందంతో తనదైన శైలిలో మూవీస్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఎంతోమంది అభిమానులు కూడా సంపాదించుకుంది.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లలో తనకంటూ ఒక ప్లేసు సంపాదించుకుంది. కొంతకాలంగా ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ నిలుస్తున్నారు రష్మిక. తాజాగా కన్నడ ఇండస్ట్రీ ఆమెపై బ్యాన్ విధించిందని కొంతకాలం నుంచి ఇలాంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఈ విషయాలపై రష్మిక స్పందిస్తూ, కన్నడ ఇండస్ట్రీ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని చెప్పుకొచ్చారు. తను నటించిన మొదటి చిత్రం గురించి ఒక బాలీవుడ్ మీడియాతో ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం ఈ వివాదానికి కారణంగా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా, అత్యధిక రెమినరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో రష్మిక కూడా ఒకరు. గీత గోవిందం, పుష్ప లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి అందరికీ ఇంకా చేరువైంది. బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం తన లక్ ని పరీక్ష చేసుకోబోతుంది.
“కాంతార విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం చూపించారు. ఆ మూవీ చూశాకా నేను మేసేజ్ పెట్టా. నటీనటుల మధ్య జరిగే విషయాలు ప్రేక్షకులకు తెలియవు. నా పర్సనల్ విషయాలను కెమెరా ముందు అందరికీ చూపించలేను. నా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పలేను. నాకు అంత అవసరం కూడా లేదు. వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అభిమానులకు చెప్పడం నా బాధ్యత”. అంటూ తనపై వస్తున్న వార్తలకు స్పందించింది రష్మిక మందన.
తాజాగా రష్మిక ,అమితాబ్ బచ్చన్ తో నటించిన మొదటి మూవీ “గుడ్ బై”. ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరో రెండు హిందీ సినిమాల్లో కూడా రష్మిక నటించినుందని సమాచారం. ఈ రెండు మూవీస్ పైనే ఆమె లక్ ఆధారపడి ఉంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ రష్మిక పుష్ప 2 చేస్తుంది. కోలీవుడ్ విషయానికొస్తే విజయ్ తో వారిసు అనే మరో మూవీ కూడా చేస్తుంది. ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకుంది పుష్ప బ్యూటీ.