Singer Indravathi: కోలీవుడ్ లో ఎంటర్ అయిన మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన అల్లు అర్జున్ మూవీ పుష్ప పార్ట్ 1. ఈ మూవీలో సమంత నటించిన ఐటెం సాంగ్ కి ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ బాగా హిట్ అయింది. ఈ పాటను ఇంద్రావతి చౌహన్ పాడారు. ఈ పాటతోనే బాగా ఫేమస్ అయింది ఇంద్రావతి చౌహన్. ప్రస్తుత ఈ సింగర్ కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ సింగర్ ఎవరో కాదు గాయని మంగ్లీ సోదరి. వీరిద్దరూ అమరావతి జిల్లాకు చెందిన బంజారా జాతి కుటుంబానికి చెందినవారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మంగ్లీ మొదట జానపద గీతాలు పాడుతూ ప్రజెంట్ సినీ గాయనిగా పాపులర్ అయింది. పుష్ప మూవీ లో ఈ పాట పాడడం ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ పాట ద్వారా సినీ ఇంఇటీవలడస్ట్రీకి పరిచయమైంది ఇంద్రావతి.
తాజాగా ఇంద్రావతి చౌహన్ కోలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి. తమిళంలో “ఎంజాయ్” అనే చిత్రంలో” చెంగు చక్కర కన్ను”అనే పాట పాడింది. పెరువళ్ కాశిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ, ఎల్ ఎన్ హెచ్ క్రియేషన్స్ పతాకంపై కే.
లక్ష్మీనారాయణ్ ఇస్తున్న మూవీ ఎంజాయ్ అనే మూవీ. గీత రచయిత వివేకా రాసిన చంగు చక్కెర కన్ను అనే పాటకు కే ఎం రయన్ సంగీతాన్ని అందించారు. మరి ఇంద్రావతి చౌహన్ తమిళంలో పాడిన ఈ పాట ఇటీవలనే విడుదల కావడం జరిగింది.
ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి, అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని సిని వర్గాలు తమ సంతోషాన్ని తెలియజేస్తాయి. “ఎంజాయ్”అనే చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమైనందుకు, చెంగు చక్కర కన్ను అనే పాట పాడడం తనకు చాలా సంతోషంగా ఉందనీ, ఈ పాట ద్వారా ఇంద్రావతి చౌహాన్ మరిన్ని అవకాశాలు వస్తూ ఉన్నాయని పేర్కొంది.
ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. జానపద పాటలు పాడుతూ, ప్రస్తుతం పుష్ప అనే మూవీ ద్వారా ఫేమస్ అయ్యి కోలీవుడ్ లో ఎంటర్ అయిన మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్.