Savitri: సావిత్రి చేసిన ఐటమ్ సాంగ్ ఇదే!

మహానటి సావిత్రి ఐటమ్ సాంగ్ లో నటించడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. అయితే ఆమె పాపులారిటీని దక్కించుకున్నప్పుడు కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించింది. చిత్రం ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో సరి సమానంగా నటించిన సావిత్రి తమిళంలో స్టార్ హీరోలైన శివాజీ గణేషన్, ఎంజీఆర్ , జెమినీ గణేషన్ వంటి హీరోలతో పాటు తెలుగులో ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి హీరోల పక్కన నటించి భారీ పాపులారిటీని దక్కించుకుంది.

ఇక సినిమా కెరియర్ మొదట్లో అక్కినేని పక్కన ఒక సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చి వచ్చినట్టే చేజారిపోవడం సావిత్రి కి ఎంతో కోపాన్ని కలిగించింది. కొన్ని రోజులు ఒంటరిగా ఏడుస్తూ కూర్చొనింది. ఆ తర్వాత తానేమిటో నిరూపించుకోవాలనే కసి ఆమెలో మొదలైంది.

సావిత్రి చేసిన ఐటమ్ సాంగ్ ఇదే!
సావిత్రి చేసిన ఐటమ్ సాంగ్ ఇదే!

అద్దం ముందు గంటల తరబడి కూర్చొని చలాకీగా డైలాగులు చెప్పడం .. భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీస్ చేసేది సావిత్రి.. అలా కొన్నాళ్ల తర్వాత 1951లో పాతాళ భైరవి చిత్రం లో ఒక నాట్యానికి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి సావిత్రి వాహిని స్టూడియోకి వెళ్లి అక్కడ దర్శకుడైన కేవీ రెడ్డి గారిని కలుసుకుంది.

అయితే ఇప్పటి ధోరణి లో చెప్పాలి అంటే ఆ పాట ఒక ఐటమ్ సాంగ్.. “నేను రాను అంటే రాను” అని ప్రారంభమయ్యే ఆ సాంగ్ లో నర్తించడానికి సావిత్రి ఎంపికయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆనాట్య సన్నివేశంలో ఎవరీ మెరుపుతీగ అన్నట్లుగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఈ ముద్దుగుమ్మ. ఒక రకంగా చెప్పాలి అంటే ఐటమ్ పాట తోనే తన కెరియర్ మొదలుపెట్టింది సావిత్రి.తెలుగు , తమిళ్ భాషలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సావిత్రి మరెన్నో సినిమాలో నటించి భారీ పాపులారిటీని దక్కించుకుంది. అయితే చిత్రం ద్వారా ఎంత పాపులారిటీ అయితే దక్కించుకుందో ఇతరులకు సహాయం చేయడంలో కూడా అంతే పాపులారిటీని దక్కించుకుంది. కానీ ఆమె మంచితనాన్ని ఆసరాగా తీసుకొని.. ఈమెను అన్యాయం చేసి చివరకు ఎవరూ లేని అనాధగా ఈమెను వదిలేశారు. దీంతో ఆఖరి దశలో అనాధగా మిగిలి స్వర్గస్తులయ్యారు సావిత్రి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker