Ram Charan: రామ్ చరణ్-షర్టు ధర ఎంత అంటే…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా ప్లేస్ సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సినిమా ఇండస్ట్రీలో హీరోస్ గాని, హీరోయిన్స్ గాని తమ కాస్ట్యూమ్స్ కోసం ఎంతో డబ్బును వేచ్చిస్తూ ఉంటారు.

ఇక ఇటీవల కాలంలో అయితే హీరోయిన్స్ కి పోటీగా హీరోస్ కూడా పబ్లిక్ అప్పియరెన్స్ కోసం రెడీ అయి కనిపిస్తున్నారు. రకరకాల డిజైన్స్ లో, రకరకాల కాస్ట్యూమ్స్ లో కనిపిస్తున్నారు. స్టార్ హీరోలా ఫ్యాషన్ సెన్స్ ఇటీవల కాలంలో బాగా పెరిగింది అని చెప్పొచ్చు.

తాజాగా రామ్ చరణ్ తేజ్ కూడా ఒక స్టన్నింగ్ లుక్ లో కనిపించాడు.ఈ లుక్ లో రామ్ చరణ్ జీబ్రా చారలతో రూపొందించిన ఒక షర్ట్ వేసుకొని కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఈ షర్ట్ ఉంది. మరి ఈ లుక్ లో ఇతన్ని చూసిన తర్వాత చాలా స్టైలిష్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారా అభిమానులు.

 రామ్ చరణ్-షర్టు ధర ఎంత అంటే...?
రామ్ చరణ్-షర్టు ధర ఎంత అంటే…?

మరి ఈ షర్టు ధర ఎంతో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ చరణ్ తోడుకున్న ఈ షర్ట్ ఖరీదు దాదాపు రెండు లక్షలు అని సమాచారం. అంత ఖరీదా అనేది పక్కన పెడితే ఈ లుక్ లో చాలా స్టైలిష్ గా, వెరైటీగా కనిపిస్తున్నాడు అని అభిమానులు ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.

ఈ షర్టు ఎగ్జాక్ట్ ఖరీదు 173326 రూపాయలు.డోల్స్ అండ్ గబ్బానా జీబ్రా ప్రింట్ షర్ట్ వేసుకున్నాడు. రామ్ చరణ్ ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖరీదైన డిజైన్ డ్రెస్సులే కాదు, ఖరీదైన కార్లు, షూస్, జర్కిన్ లతో పాటు ఖరీదైన గడియారాలు కూడా పెట్టుకుంటూ ఉంటాడు.

క్లాసిక్ లగ్జరీ టైమ్ పీస్ వాచ్లను సేకరించే అలవాటు కూడా ఉంది రామ్ చరణ్ కి. పదుల సంఖ్యలోనే అతని దగ్గర బ్రాండెడ్ వాచ్ ఉన్నాయి అని సమాచారం. రీసెంట్ గా రెండు కోట్లు ఖరీదైన లిమిటెడ్ ఎడిషన్ వాచ్ పెట్టుకొని కనిపించాడు రామ్ చరణ్.

తాజాగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని, శుభవార్త ని తమ అభిమానులతో, ప్రేక్షకులతో పంచుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు.”శ్రీ హనుమాన్ ఆశీస్సులతో ఉపాసన – రామ్ చరణ్ తమ మొదటి బిడ్డకు వెల్ కం చెబుతున్నారని చెప్పడానికి మేం సంతోషిస్తున్నాము. ప్రేమ కృతజ్ఞతలతో సురేఖ – చిరంజీవి కొణిదెల.. శోభన & అనిల్ కామినేని”అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

మరి ఈ శుభవార్త విన్న మెగా అభిమానులు అందరీ ఆనందానికి హద్దులు లేవు. తన ఫ్యామిలీలో జరిగే హ్యాపీ మూమెంట్స్ ని, ఫొటోస్ నే షేర్ చేసుకుంటూ ఉపాసన డిసెంబర్ 15వ తేదీన ఒక ఫోటోని షేర్ చేశారు.నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ప్రవేశిస్తున్నాను.

అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఉపాసన. ప్రజెంట్ ఈ జంట థాయిలాండ్ లో సన్నిహితుల వివాహానికి హాజరవుతున్నారని తెలిసింది. మెగా ఫ్యామిలీ అందరూ ప్రస్తుతం ఈ వార్తతో చాలా ఆనందంగా ఉన్నారు. జూనియర్ చెర్రీ రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా ఈ వార్త వైరల్ అవుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker