Guppedantha manasu today episode:రిషి ,సాక్షి ని పెళ్లి చేసుకోడని తేల్చి చెప్పిన దేవయాని:
రిషి సాక్షి ని పెళ్లి చేసుకోడని తేల్చి చెప్పిన దేవయాని: దేవయాని రిషితో సాక్షి గురించి మాట్లాడాలని అంటుంది. మన ఇంటి సమస్య గురించి మాట్లాడడానికి రమ్మన్నాను అనగా సాక్షి అసలు సమస్య కాదు తనకు మనకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు రిషి. సాక్షి మీడియా ముందు మాట్లాడినప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నావు.
ఇక అన్ని అయిపోయాయి ఇక పెళ్లి అని అంటుంది దేవయాని. రిషి కోపంతో ఎవరు సాక్షి మనకు సంబంధం లేదు. తనతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. కాలేజ్ పరువు కోసం మాట్లాడకుండా ఉన్నాను. చదువుల పండగను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉన్నానని చెప్తాడు రిషి.
సాక్షి గురించి మీకు తెలియదు. ఒకరోజు ఫైర్ అలారం మోగింది గుర్తుందా అక్కడ సాక్షి ఏం చేసిందంటే. నన్ను ఒంటరిగా లైబ్రరీకి రమ్మన్నాడు. అల్లరి చేశాడు. ఒకరి మీద మోజు పడి వదిలించుకోవాలని చూస్తున్నాడుని నటిస్తాను చెప్పి బెదిరించింది. చదువుల పండగ రోజు కూడా కొన్ని ఫోటోలు చూపించి మీడియా ముందు బయట పెడతాను ఆ ఫోటోలకు ఒక అందమైన ప్రేమ కథ సృష్టిస్తాను నీకు ఇష్టమైన వారి పరువు పోతుంది నువ్వే ఆలోచించుకో అని బెదిరించింది.
518 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.
రిషి విషయంలో దేవయాని ఏ నిర్ణయం తీసుకోబోతుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం.
సాక్షి నీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిన రిషి: ఆ ఫోటోలు నేను వసుధార మాట్లాడుకుంటున్నవి. స్టోర్ రూమ్ లో జెండాల కోసం వెతుకుతున్నప్పటి ఫోటోలు. వాటిని చూపించి బెదిరించింది. సాక్షి అంటే నాకు ఇష్టం లేదు. తను సూసైడ్ చేస్తుందని మీరు చెప్పినందువల్ల మానవత్వంతో మాట్లాడుతున్నాను. తనంటే నాకు ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి తనకు నాకు ఎటువంటి సంబంధం లేదు.
సాక్షికి మీరే చెప్పండి తను చేసింది తప్పు. లేదంటే నేనేంటో చూపించాల్సి ఉంటుంది అని రిషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వసూ, రిషి ఇద్దరూ ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటారు. మనం ఒక చోటికి వెళ్లాలి వెళ్దాం రా అని వసుధార ను చేయబట్టి తీసుకొని వెళ్తాడు రిషి. ఇక్కడ దేవయాని ఏం చేస్తుందో ఏం ప్లాన్ వేస్తుందో అని మహేంద్ర జగతి మాట్లాడుకుంటూ రిషి గురించి భయపడుతూ ఉంటుంది జగతి. రిషి గురించి భయపడిన అవసరం లేదు తను ఎక్కడికి వెళ్లాలనుకున్నాడు అక్కడికే వెళ్తాడు నువ్వేమి కంగారు పడవద్దని అంటాడు.
రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా. ఎప్పుడూ ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉంటావా అని అంటాడు రిషి. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లిన నేను భయపడను. నేను మిమ్మల్ని నమ్ముతాను అందుకే కంగారు పడలేదు అని వసు అంటుంది. ఇంతలో కార్ ఆగిపోవడంతో కిందికి దిగి మనం చాలా దూరం వచ్చినట్టు ఉన్నాము .ఎక్కడికి వెళ్తున్నాం అని తిరిగి వెళ్లాలంటే ఎలా వెళ్లాలిఅడుగుతుంది వసుధార. చాలా దూరమే వచ్చాము. తిరిగి వెళ్లాలంటే ఇదే దారిలో వెళ్లాలి. ప్రయాణం ఆగినంత మాత్రాన మార్పు రాదు కదా అని అంటాడు రిషి .ఇది రిషి వసుధారాల మధ్య జరిగిన సంభాషణ.
రిషి ఇంటికి వచ్చే సాక్షి చేసిన పని: రిషి ఏం చేస్తున్నాడు మీకు తెలుసా. పెళ్లి చేసుకునేది నన్ను వెళ్తే షికార్లకు నన్ను తీసుకొని వెళ్ళాలి వసుధారతో వెళ్లడమేంటి. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే సమాధానం చెప్పడు. వసుధారతో ఉన్నానని ఫోన్ కట్ చేస్తున్నాడు. అసలు రిషికి నేనంటే ఇష్టం లేదా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా. రిషి పద్ధతి బాగాలేదు. తనను మార్చాలి అని అంటుంది సాక్షి. మీకేమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి అంటుంది జగతి. ఇంతలో దేవయాని నీ సమస్య ఏంటి అని సాక్షిని అడుగుతుంది.
రిషి ఇంతకుముందులా లేడు మేము పెళ్లి చేసుకోబోతున్నాం అన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు నన్ను పక్కకు పెట్టేశాడు నాతో ప్రేమగా ఉండటం లేదు. నన్ను గుర్తించట్లేదు. ఈ పెళ్లి ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రెస్ మీట్ లో ఏమన్నావు దానికిరిషి ఏమీ మాట్లాడలేదు కాబట్టి దానికి అర్థం అవునని అనుకుంటున్నావు. కాలేజీలో సొంత విషయాలు ఎందుకని మాట్లాడకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన పెళ్లి ఒప్పుకున్నట్లు కాదు కదా . రిషి కి నువ్వంటే ఇష్టం లేదు. రిషి నిన్ను ప్రేమించడం లేదని .నిన్ను పెళ్లి చేసుకోడు అన్ననిజాన్ని బయట పెట్టింది దేవయాని. అది చూసి ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు.
ఇద ఈరోజు519 ఎపిసోడ్లో జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కథానిక.