Guppedantha manasu today:దేవయాని తన నటనతో సాక్షితో పెళ్లికి రిషిని ఒప్పించిందా?
దేవయాని తన నటనతో సాక్షితో పెళ్లికి రిషిని ఒప్పించిందా?
సాక్షి మీద కోపంతో ధరణిని దేవయాని అరుస్తూ ఉండగా జగతి వచ్చి ఏమయింది అని అడుగుతుంది. సాక్షి కోపం నామీదనే చూపిస్తుంది. మీకేం మీరు బాగానే ఉన్నారు. నామీద కేసు పెడతాననింది. దానివల్ల కాలేజ్ పరువు పోతుంది. కుటుంబం పరువు పోతుంది. రిషి బాదపడతాడని ఆలోచిస్తున్నాను అంటుంది దేవయాని. అవసరం లేని విషయాలకు గురించి మీరు భయపడుతున్నారు. సాక్షికి మీరు భయపడం ఏంటని అడుగుతుంది జగతి. బెదిరింపులు ఎవరు చేశారని కాదు. కుటుంబం పరుపు మీద కొడుతుంది. నన్ను రిషి మాత్రమే అర్థం చేసుకుంటాడు అని అంటుంది దేవయాని.
దామోదర్ ఇంట్లో కరెంటు పోవడంతో ఫీజులు పోయి ఉంటాయి అని వసుధారా రిపేర్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా రిషి ఒల్లో పడుతుంది. ఒకరినొకరు చూస్తూ వసూ మనసులో ఏముందో ప్రేమ గురించి చెప్పటం లేదని రిషి. వసు ప్రేమ విషయం రిషికి చెప్పాలనుకోగానే దామోదర్ భార్య అయిపోయిందా అని అడుగుతుంది. భోజనం చేయండి. మెకానిక్ రాలేదు. ఇక్కడే ఉండండి అని అంటారు.
ఇది నిన్న జరిగిన 520 ఎపిసోడ్ లోని గుప్పెడంత మనసు సీరియల్ మొత్తం కథ. ఎటువంటి టెన్షన్స్ పడకుండా సీరియల్ లో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఇది సులువైన పద్ధతి.
ఏదో జరుగుతుందని అనుమానించిన జగతి: గౌతమ్, మహేంద్ర ,జగతి రూములో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ సాక్షికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? దేవయానిని అన్ని మాటలు ఎలా మాట్లాడింది. దేవయానిని అంటే రిషి ని అన్నట్టు కదా అని అంటాడు మహేంద్రతో. ఇద్దరూ ఒకటే ఇలా మాట్లాడుకున్నారంటే ఏదో జరుగుతుందని అనుమాన పడుతుంది జగతి. రిషి, వసు ఎక్కడ ఉన్నారో ఫోన్ తీయడం లేదని ఇద్దరు కలవాలని కోరుకుంటున్నారు, వాళ్ళు కలిసి పోవాలని కోరుకుంటున్నాను అంటాడు మహేంద్ర.
వసు కు తన మనసులోని బాధను చెప్పిన రిషి: చలిమంట ముందు కూర్చొని ప్రతిదీ జ్ఞాపకంలో ఉంచుకుంటాను. మీకు నేను చేసిన గాయమే గుర్తుకు వస్తుంది. నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటుంది వసుధార. రిషి సలిమంటను ఆస్వాదిస్తే బాగుంటుంది. మనం చిరాకులో ఉంటే గుండె మంటలు మన కళ్ళముందే కనిపిస్తుంటాయి కదా. నేను ఇస్తే తీసుకొని దానిని నా కళ్ళముందే పగిలిపోయిన గిఫ్ట్ను మళ్ళీ నాకు ఇవ్వాలని ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. అసలు ఏమీ జరగని దానిలా ఎలా ఉంటున్నావు అంటూ నేను బాధను బాధలా చూస్తాను.
సంతోషాన్ని సంతోషంగా చూస్తాను. కొంతమందిలా గంభీరంగా ఉండటం నావల్ల కాదు నేను నాలాగే ఉంటాను. అని చెప్పి నువ్వు ఎలానార్మల్గా ఉంటున్నావు. నీకైనా తెలుసా? అని ప్రశ్నిస్తాడు వసుధారను రిషి. రిషి సార్తో ఇప్పుడు నా మనసులోని మాట చెప్పిన నమ్మరు. సాక్షి బెదిరించింది అని చెప్పినా నమ్మరు అని మనసులో అనుకొని ఇప్పుడు ఏమీ వద్దు అంటుంది వసు. అందరూ మారిపోయారు .నేను ఒక్కడినే అలాగా ఉన్నాను. నా నుంచి నేనే పారిపోవాలని అనుకుంటాను. ఒక రకంగా ఇలా రావడం కూడా దానికి కారణం కావచ్చు.
నా గురించి నువ్వు ఒక్క ముక్కలో వివరంగా చెప్పావు. క్లారిటీ లేదని. అదే నిజమే అని వసుతో అంటాడు. ఇంతలో కారు రిపేర్ అయిందని మెకానిక్ వచ్చి చెప్తాడు.
రిషి కి ఫోన్ చేసి నటించిన దేవయాని: రిషి తన ఫోన్ చూసుకోగానే దేవయానికి ఫోన్ చేస్తాడు. ఏమైంది ఫోన్ చేశారు అని అడగగా
ఏమైపోయావు. నేను నిన్ను చూస్తానా లేదా. చివరిసారిగా నిన్ను చూస్తానో లేదో త్వరగా ఇంటికి రా అని నటిస్తూ ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది దేవయాని. దానితో రిషి కంగారుపడుతూ ఇంటికి బయలుదేరుతాడు. దారిలో వసుధార దేవయానికి ఏమైందని జగతికి మెసేజ్ చేస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు రిషి ఉన్నాడని జగతి మెసేజ్ చేస్తుంది. అది చూసిన రిషికి కోపం వస్తుందని గమనించిన వసు సైలెంట్ గా ఉంటుంది.
దేవయానిని వేడుకున్న జగతి: నామీద కోపం ఉంటే నన్ను ఏమైనా అనండి. నాకేమైనా చెయ్యండి. అంతేకానీ నామీద కోపంతో నా కొడుకు జీవితాన్ని నాశనం చేయవద్దు అంటూ దేవయానికి దండం పెడతానని చేతులెత్తి నమస్కరిస్తుంది జగతి. ఓడిపోయాను అని చేతులెత్తేశావా. రిషి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పినా అది చేస్తాడు. రిషి నా ఆయుధం. నువ్వు చూస్తూ ఉండు సాక్షిని ఈ ఇంటికి కోడలు చేస్తాను. ఈ బుద్ధి ముందునుండి ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు కదా అంటుంది దేవయాని. ముందు నుంచి ఇలాగే ఉన్నాను. ఒక్కోసారి ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వచ్చారు. నామీద కోపం రిషి మీద చూపించవద్దు. మీరు రిషి నీ పెంచారు. ఎంత కాదన్నా రిషి మీద ప్రేమ, హక్కు ఉంటుంది. సాక్షిని రిషి జీవితంలోనికి తీసుకురావాలని ఎందుకు అనుకుంటున్నారు. అని ప్రశ్నిస్తుంది జగతి. రిషి నేను చెప్పింది వింటాడు. సాక్షి కూడా నా మాట వింటుంది. ఈ ఇంటికి వచ్చే కోడలు నా మాటే వినాలి. నీ సెలక్షన్ తో వచ్చే కోడలు నా చెప్పు చేతుల్లో ఉండదు. నీకున్న లక్షణాలే తనలో ఉంటాయి. అందుకే అంతా అయిపోయింది అంటుంది దేవయాని. జగతిని టెన్షన్ పడవద్దు వెళ్ళిపొమ్మంటుంది.
రిషి ని క్షమించమన్న దేవయాని: మహేంద్ర దగ్గరికి వచ్చి రిషికి ఫోన్ చేయమని చెప్తుంది జగతి. మహీంద్రా ఫోన్ చేస్తుండగానే రిషి ఇంటికి వస్తాడు. అందరూ ఎక్కడికి వెళ్లావు అడుగుతుండగానే దేవయాని కోసం రూమ్ లోకి వెళ్తాడు. రిషి దేవయాని లేపి ఏమైంది. ఎందుకలా మాట్లాడారు అంటాడు. హాస్పిటల్ కు వెళ్దాం రండి అనగా మందులతో మనోవేదన తీరదు. టెస్టులతో మనసు కష్టాలు తెలియవు. హాస్పిటల్కు వద్దు కొంచెం సేపు నాతో మాట్లాడు చాలు. చిన్నప్పటినుండి నువ్వు ప్రాణంగా నేను చూసుకున్నాను. మధ్యలో తెలియకుండా చిన్న పొరపాట్లు చేసి ఉంటాను. నన్ను క్షమించు.సాక్షి విషయంలో నేను పొరపాటు చేశాను అన్నది దేవయాని. ఇది ఈరోజు జరిగిన 521 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.