Karthika deepam serial today episode:ప్రేమ్ ను నిరుపముతో పెళ్లిని ఆపేయమని కోరుకున్న హిమ
ప్రేమ్ ను నిరుపముతో పెళ్లిని ఆపేయమని కోరుకున్న హిమ:
సత్యం భోజనం చేస్తూ ఉండగా శోభ అక్కడికి వచ్చి తినండి. బాగా తినండి. అక్కడ ఆంటీ నిరుపమ్ కోసం భోజనం చేయకుండా ఉంటే మీరేమో బాగా తింటున్నారు అని అంటుండగానే సౌందర్య వచ్చి శోభన కొడుతుంది. ఎందుకు కొడుతున్నారని శోభ అడగగా నా కూతురు ఇంట్లో ఉంటూ నీ పెత్తనం ఏంటని అరుస్తుంది సౌందర్య. స్వప్న వచ్చి నా కోడల్ని ఎందుకు కొడుతున్నావ్ అంటుంది. ఇంకా మాట్లాడితే నిన్ను కొడతాను. నీ కోడలు ఇది అని హిమ ఫోటోలు చూపిస్తుంది. ఇదే మీ కోడలు అంటుంది. శోభను చూపిస్తూ ఇది నీ కోడలా, నువ్వు అనుకుంటే సరిపోతుందా. నీ కోడలు హిమే. ఫిక్స్ అవ్వండి అని అంటుంది సౌందర్య.
ఇది నిన్న జరిగిన 1422 ఎపిసోడ్ కార్తీకదీపం పూర్తి కథ.
హిమా, నిరరుపమ్ ల పెళ్లి కచ్చితంగా జరిపిస్తానన్న సౌందర్య:
ఇదే ముహూర్తానికి నా మనవరాలు, మనవడికి పెళ్లి జరుగుతుంది అని అంటుంది సౌందర్య. నా కొడుకు పెళ్లి విషయంలో నీ పెత్తనం ఏంటని స్వప్న అడుగుతుంది. నీ మీదే హక్కు ఉన్నప్పుడు నీ కొడుకు మీద కూడా హక్కు ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నేను నిన్ను ఏదో అన్నానని నువ్వు బాధపడ్డావని నువ్వు ఎన్ని అన్నా పడతానని అనుకోకు. అందరికీ చెప్తున్నాను వినండి.
సౌందర్య ఏంటో చూపించాల్సి వస్తుంది. నా మనవడు పెళ్లి నా మనవరాలు తోనే జరుగుతుందని అంటుంది సౌందర్య. కోపం పట్టుదల నీకెంత ఉన్నాయో. నాకు అంతే ఉన్నాయి. పెళ్లి ఆగిపోయేలా చూస్తాను. ఈ పెళ్లి ఎలా ఆపాలో బాగా నాకు బాగా తెలుసు అంటుంది స్వప్న. నీ చేతనైంది నువ్వు చేసుకో. నిన్ను ఎలా అప్పాలో నాకు తెలుసు అని సౌందర్య చెప్పి వెళ్ళిపోతుంది.
ప్రేమ్ ని పెళ్లి ఆపమని కోరుకున్న హిమ: హిమ మాట్లాడాలని ప్రేమను పిలుస్తుంది. ఏంటి హిమ ఏదో మాట్లాడాలని చెప్పావు. ఏంటో చెప్పు నాకు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తావా అని అడుగుతాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం అయింది. ఇప్పుడు ఆ టాపిక్ తీయకు అంటుంది హిమ. హిమ మనసు ఎప్పుడు మారుతుందో, ప్రేమ ఎప్పుడు పుడుతుందో అంతవరకు నేను వేచి చూడాలని ప్రేమ తన మనసులో అనుకుంటాడు. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపమని ప్రేమ్ చేయి పట్టుకొని అడుగుతుంది హిమ. నువ్వు కంగారు పడకు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతానని ప్రేమ్ చెప్పాడు.
సౌర్య కోసం శోభ వచ్చి వెళ్లిందన్న విషయాన్ని చెప్పిన ఆనంద్: మౌనిత కొడుకు ఆనంద్ సౌర్యను ఏంటి జ్వాలా టీ తాగడం లేదు, టిఫిన్ తినడం లేదని, నా మీద కోపంగా ఉన్నావా అని అడుగుతాడు. నీ మీద నాకెందుకు కోపం. ప్రపంచం మీదే కోపం. నామీద నాకే కోపం అంటుంది. నీకోసం శోభా అనే ఆవిడ వచ్చి వెళ్ళింది. నువ్వు ఇక్కడికి రావడం లేదని చెప్పాను ఇంకా వెళ్ళిపోయింది. మీ నానమ్మ వాళ్ళది పెద్ద ఇల్లు అంట కదా నేను చూడలేదు.
ఒకసారి నన్ను తీసుకెళ్లి చూపించు అంటాడు ఆనంద్. ఏముంటుంది ఏమీ ఉండదు మామూలు మనసులే ఉంటారు అందరిలాగే మోసం చేస్తూ ఉంటారు అంటుంది శౌర్య. ఆనంద్ ఒక్కసారైనా ఆ ఇల్లు చూడాలని కోరికగా ఉందని చెప్తాడు. శౌర్యపాత జ్ఞాపకం గుర్తుకు చేసుకొని నువ్వు కూడా ఆ ఇంటి మనిషివే . మనసులో మౌనిత ఆంటీ కొడుకు అని అనుకుంటుంది. పెద్ద పెద్ద ఇళ్లలో పెద్ద కార్లలో తిరిగే వారికి పెద్ద మనసు ఉండదు అని అంటుంది సౌర్య.
మౌనిత క్యారెక్టర్ గా వచ్చానన్న శోభ: స్వప్నకు శోభ మండపం డెకరేషన్ చేస్తున్నారంటే చెబుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ తల్లి మనస్సు గొప్పది. ఖర్చు లేకుండా అన్ని పనులు మా అమ్మ చేస్తుందని స్వప్న నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మకు మొండితనం ఎక్కువ. నువ్వు డాక్టర్ వి కదా నీకైనా అర్థం ఉండాలిగా. నేను హిమను ప్రేమిస్తున్నాను, తనతోనే జీవితం ఈ విషయం అందరికీ చెప్పాను. నీకు ఎందుకు అర్థం కావడం లేదని నిరుపమ్, శోభను ప్రశ్నిస్తాడు.
భూమి గుండ్రంగానే ఉంటుంది అది నిజమే. కొన్ని పరిస్థితులు కూడా అలాగే. ఒకప్పుడు మీ మేనమామ కార్తీక్ ఉన్నప్పుడు తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తన పేరు మౌనిత అంటుంది శోభ. ఇవన్నీ అవసరం లేదు ఆవిడ బ్రతికే ఉందో చనిపోయిందో తెలియదని నిరుపమంటాడు. ఆమె ఉందో లేదో తెలియకపోయినా నేను బ్రతికే ఉన్నాను. మీ మేనమామ ను ఆవిడ ప్రేమించింది. నేను నిన్ను ప్రేమించాను.
కార్తీక్ ముందు ఎస్ అని తర్వాత కాదన్నాడట. నువ్వు ముందు ఫ్రెండ్లీగా ఉన్నావు. పెళ్లి చేసుకుంటాను అంటే వద్దు అంటున్నావు. ఆవిడకు నాకు దగ్గర పోలిక ఉంది. మేనమామ బుద్ధులు నీకు వస్తే. మౌనిత క్యారెక్టర్ గా నేను వచ్చాను. నేను అలాగే మొండిదాన్ని ,పట్టుదలతో ఉంటాను. ఎందుకంటే ప్రేమ కథ అని అంటుంది శోభ .నువ్వు హిమని పెళ్లి చేసుకోబోతున్నావు. హిమతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పించు. వెంటనే వెళ్ళిపోతాను అంటుంది శోభ. ఇంకేమి మాట్లాడవద్దు. ఏంటి ఇదంతా. నువ్వు అన్నం తినకుండా బాధపడుతున్నావని వచ్చాను. ఏంటమ్మా ఇదంతా అని కోపగించుకొని నిరుపమ్ వెళ్ళిపోతాడు.
నువ్వు డాక్టర్ కార్తీక్, వంటలక్కల కూతురువని సౌర్యనుఅన్న ఆనందరావు: సౌర్య ఆనంద మాటలు గుర్తుకు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు వచ్చి ఏం ఆలోచిస్తున్నామని అడుగుతాడు. నాది ఆటో లాంటి చిన్న జీవితం. ఆలోచించడానికి ఏం ఉండదు అంటుంది శౌర్య. ఎందుకు నిన్ను నువ్వు అలా తక్కువ చేసుకుంటావు. గ్రేట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్, గ్రేట్ వంటలక్క దీపలకూతురివి, సౌందర్య ఆనంద్ రావుల మనవరాలివి అని అంటాడు.
ఇక ఆపండి వీళ్లందరి వల్లనే నాకు గొప్ప. ప్రత్యేకంగా నాకంటూ ఏముంది అంటుంది. నేను ఇంట్లో ఫ్లవర్ వాస్ లాంటిదాన్ని, గోడలకు వేలాడదీసిన పెయింట్ లాంటి దాన్ని పెద్ద గుర్తింపు ఉండదు. మనది అని చెప్పుకోవడానికి మాత్రమే. మేఘాలు వస్తాయి, పోతాయి. నేను కూడా అలాంటి దాన్ని సమాధానం చెప్తుంది సౌర్య.
పెళ్లి ఆపడానికి ఉపాయం ఆలోచిస్తున్న ప్రేమ్: శౌర్యను నువ్వు అడిగినవన్నీ చేసేవాళ్లం. కానీ కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిపించకపోతున్నాం అంటాడు ఆనందరావు. ఇంట్లో పెళ్లి జరుగుతుంది నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదంటాడు. నేను ప్రేమించిన వాడితో మీ మనవరాలు పెళ్ళి జరుగుతుంది. అలాంటి ఇంట్లో ఉండడమే పెద్ద నరకం. అలాంటిది సంతోషంగా ఉండాలి అంటున్నారు అని అంటుంది శౌర్య.
ప్రేమ్ సత్యం వద్దకు వచ్చి ఈ టైంలో చదువుతున్నారు. గ్లాస్ పట్టుకొని తిరిగేవాళ్లు కదా. అమ్మంటే భయమా అని అంటాడు. స్వేచ్ఛ అనేది మనసులో ఉండాలి. గ్లాసులో కాదు. అని అంటాడు నాకు ఒక ఉపాయం చెప్పండి హిమ, నిరుపమ్ ని పెళ్లి చేసుకోను అని అంటుంది. నీరుపమ్, హిమనీ చేసుకుంటానని అంటున్నాడు. దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని ప్రేమ్ అడుగుతాడు. ఇద్దరు మనసుల మధ్య గొడవలు వస్తే బాగానే ఉంటుంది. ప్రేమ. భార్యాభర్తల మధ్య జోకం చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయ్యింది. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళే చూసుకుంటారు. మనం మధ్యలో వెళ్లకపోవడమే మంచిదని అంటాడు సత్యం.
సౌందర్య ఆనందరావులను దేవుళ్ళు అన్న నిరూపం: ఆనందరావు ఆలోచిస్తూ కూర్చుంటాడు. సౌందర్య ఏమైంది ఏమంటుంది ఆటో మనవరాలు అని అడుగుతుంది. తన మనసులోని బాధను మనం తీసివేయలేకపోతున్నామని అంటాడు అనంతరావు. కొన్ని బాధలు అవే పోతాయి. కాలమే సమాధానం చెబుతుంది. మనం ధైర్యంగా ఉండాలి. హిమ, నిరుపమ్ ల పెళ్లి చేద్దాం.
సౌర్య తనకు తానే సమాధానం చెప్పుకుంటుందని అంటుంది సౌందర్య. అది విన్న నిరుపమ్ థాంక్స్ అని చెప్తాడు. థాంక్స్ ఎందుకు అని అడుగుతుంది సౌందర్య. హిమకి నామీద ప్రేమ ఉంది. మొండిగా ఉండి వద్దు అని అంటుంది. నువ్వు, తాతయ్య సపోర్ట్ గా ఉంటే చాలు అంటాడు నిరుపమ్. చాలాకాలం తర్వాత శౌర్య ఇంటికి వచ్చింది. సౌర మీద ప్రేమ ఎక్కువై తనను బాధ పెట్టకూడదని. తనను పెళ్లి చేసుకోమంటారేమో అని అనుకున్నాను. మీరు గొప్ప వాళ్ళు .మీరు దేవుళ్ళు అని మొక్కుతుంటాడు.
ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పిన స్వప్న: ఇంతలో స్వప్న వచ్చి ఈ ఒక్కడివే ఆశీర్వాదం తీసుకుంటున్నావా. జంటగా తీసుకో శోభ నువ్వు వెళ్ళు ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకోండి అంటుంది. వాళ్లు నువ్వు అనుకున్నంత గొప్పవారు కాదని అంటుంది స్వప్న. ఇది ఈరోజు 1423 ఎపిసోడ్ లో జరిగిన కార్తీకదీపం కథ.