Guppedanth manasu today: ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రిషి

తన ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రిషి:

రిషి తన రూమ్ లో కూర్చుని వసు ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ ఉండగా మహేంద్ర అక్కడికి వస్తాడు.

ఇది నిన్న జరిగిన 523 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ మొత్తం కథ.

రిషి నిర్ణయాన్ని మార్చుకోమన్న వసుధార: వసుధార, రిషి  రెస్టారెంట్లో కలుసుకుంటారు. మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందని వసు అనగా ఎందుకు అని రిషి ప్రశ్నిస్తాడు. నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది. నేను ఏం కావాలి. నా ప్రయాణం ఏంటి.

నేను ఎక్కడికి వెళ్లాలని నాకు బాగా తెలుసు. అది నెరవేరచ్చు. నెరవేరకపోవచ్చు. ప్రయాణం మధ్యలో ఆగిపోవచ్చు. కానీ మనకు ఇష్టమైన పని చేయడంలో ఆనందం ఉంటుంది. మీరు ఎందుకు ఇలా ఆలోచించారో నాకు అర్థం కావడం లేదని రిషిని ప్రశ్నిస్తుంది వసు. జీవితంలో అన్నీ అర్థం కావు కొందరు మనతో పాటు తిరుగుతూ, ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్లే మనకు అర్థం కారు.

ఎక్కడో ఉన్నవాళ్లు అర్థం చేసుకోవాలని ఏముంది అని సమాధానం ఇస్తాడురిషి. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు అని అంటుంది వసుధార. మనం చాలా అనుకుంటాం. అన్నీ జరగాలని లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.

సాక్షి మాటలకు సమాధానం చెప్పిన రిషి: సాక్షి రిషి వద్దకు వచ్చి థాంక్యూ చాలా సంతోషంగా ఉన్నాను. మన పెళ్లికి అంగీకరించావు. ఈ ఆనందంలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలుసు నీకు కూడా అలాంటి పరిస్థితి ఉందని. పెళ్లంటే ఫ్రెండ్స్ ని పిలవాలి. షాపింగ్ చేయాలి అంటూ నీ పేరులోని ఆర్ అనే అక్షరంతో రింగు చేయిస్తున్నాను. నువ్వు కూడా ఎస్ అనే అక్షరంతో రింగు చేయిస్తావు కదా. ఒకరినొకరం అనే ఫీలింగ్ ఉంటుంది అని అడుగుతుంది సాక్షి. రిషి సరే చూద్దాం అని చెప్తాడు.

షాపింగ్ కు వెళ్దాం రా అని అడుగుతుంది సాక్షి. గంటల తరబడి వేచి ఉండడం నాకు ఇష్టం లేదు.  ఇది స్వీట్ మెమొరీ కదా అర్థం చేసుకోవడంలో ఏముంది అని అంటుంది. ఎదుటివారిని అర్థం చేసుకోవడం ఒక కల అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుండగా జగతి చూస్తుంది.

సాక్షి జగతి దగ్గరకు వచ్చి  ఏంటి అలా చూస్తున్నారని అడుగుతుంది. జీవితంలో చూడకూడనివి చూడాల్సి వస్తుంది. జరగకూడని జరగా జరుగుతుంటాయిఅని జగతి సమాధానం ఇస్తుంది.  నీ మనసులో ఏముందో నాకు తెలుసు అని అంటుంది సాక్షి. నీ మనసులో ఏముందో నాకు కూడా తెలుసు అని సమాధానం ఇస్తుంది జగతి.

వసుదార గురించి ఆలోచించమని చెప్పిన మహేంద్ర: రిషి వద్దకు మహేంద్ర వచ్చి ఓకే ఇంట్లో ఉన్న దూరం పెరిగింది. నీకు ఏమైంది. ఏం ఆలోచిస్తున్నావు. ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఒకప్పుడు సాక్షి పేరు వినగానే కోపం వచ్చేది.

జీవితంలో పెళ్లి అనేది గొప్ప మలుపు. అలాంటిది సాక్షితో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావని ప్రశ్నిస్తాడు.వసు గురించి ఆలోచించు అని మహేంద్ర అడుగుతాడు. నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని రిషి చెప్తాడు. మహేంద్ర నీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది నాకు నేను పెట్టుకున్న పరీక్ష. ఇది కఠినమైనదని నాకు తెలుసు. ఈ పరీక్షలో నేను గెలుస్తాను. నా ప్రేమను గెలవాలంటే నేను ఈ పరీక్షలో గెలవాలి అని రిషి తన మనసులో అనుకుంటాడు.

తన ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్న వసు: వసుధార అమ్మవారి దగ్గరికి వచ్చి నేను ఏం అడిగాను. నువ్వు ఏం చేస్తున్నావు? నీకు కూడా నా మీద కోపమా. నువ్వు కూడా నన్ను పట్టించుకోకపోతే నన్ను ఎవరు చూస్తారు. రిషి సార్ తనను మర్చిపోతాను అంటున్నారా నాకు అర్థం కావడం లేదు. సాక్షితో రిషి సార్ జీవితాంతం తనతో ఎలా ఉంటారు. ఇది నువ్వా, రిషి సార్ పెట్టిన పరీక్ష కాదు. నా మనసుకు, నా ప్రేమకు పరీక్ష. ఇందులో నేను ఎలాగైనా గెలుస్తాను. రిషి సార్ మనసు ఎలా గెలవాలో నాకు తెలుసని మాట్లాడుకుంటుంది వసుధార.

రిషి మనసులో స్థానం సంపాదించమని చెప్పిన దేవయాని: దేవయాని సాక్షి నీ కళ నిజమవుతుంది కదా అని అడుగుతుంది. రిషి పెళ్లికి ఒప్పుకున్నాడు అనే మాటే కానీ ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడు. చెప్పింది వినడు. షాపింగ్ కు రాడు బయటికి వెళ్దాం అంటే రాడు. నన్ను పట్టించుకోవడం లేదు. మా ఇద్దరికీ పెళ్లి జరుగుతుందన్న ధ్యాసే లేదు అని అంటుంది సాక్షి. రిషి సంగతి తెలిసిందే కదా అని సమాధానం ఇస్తుంది దేవయాని. అసలు మా పెళ్లి జరుగుతుందా అన్న అనుమానం వస్తుంది.

పెళ్లికూతురు వి నువ్వే అలా అంటే ఎలా చెప్పు. ఇవన్నీ కాదు ముందు రిషి ప్రేమను గెలువు. నువ్వు ఏం చెప్తే అది వింటాడు. రిషి మనసులో స్నానం సంపాదించమని దేవయాని అంటుంది.

సాక్షిని బయటకి వెళ్ళమని చెప్పిన రిషి: రిషి వసుధారను గుర్తుకు చేసుకుంటూ జ్ఞాపకాలు ఎంత అందమైనవి  కదా అని అనుకుంటూ ఉండగా సాక్షి వచ్చి వసుదార ఫోటోలు చూస్తున్నావా అని అడుగుతుంది. కనిపిస్తుంది కదా మళ్లీ అడుగుతావు ఎందుకని ప్రశ్నిస్తాడు రిషి. మనకి పెళ్లి జరుగుతుంది. నువ్వు తన ఫోటోలు చూడటం ఏంటని ప్రశ్నిస్తుంది. నేనేం చేయాలో నువ్వేంటి చెప్పేది అని అంటాడు రిషి. నేను వచ్చి నీ వెనక నిలబడ్డాను. నన్ను పట్టించుకోవడం లేదు అంటుంది. నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారు. వచ్చేముందు పర్మిషన్ తీసుకుని రావాలి కదా అని కోపంతో గట్టిగా అడుస్తాడు. సాక్షి నేను కూడా పర్మిషన్ తీసుకొని రావాలని అడుగుతుంది.

ఎవరైనా అలాగే రావాలి అని సమాధానం ఇస్తాడు. అది చూసిన దేవాయని సాక్షి మళ్ళీ ఏం గొడవ చేస్తుందో అని అనుకుంటూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడవద్దు. పర్మిషన్ లేకుండా వచ్చింది నువ్వు అని రిషి అంటాడు. దేవయాని అక్కడికి వచ్చి ఏమయింది అని అడుగుతుంది. వసుదార ఫోటోలు చూస్తూ మైమరిచిపోతున్నాడని చెప్తుంది సాక్షి. రిషి కోపంతో మర్యాదగా మాట్లాడు. మాటలు మర్యాదగా ఉండాలి.

ఇంటికి వచ్చావు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను బయటికి వెళ్ళమని రిషి అంటాడు. మాట్లాడడానికి వచ్చాను బయటికి వెళ్లడానికి కాదని సాక్షి అంటుంది. మాట్లాడే పద్ధతి నీకు తెలియదు. నీతో మాట్లాడే అవసరం నాకు లేదని అంటాడు రిషి. ఏంటి ఇదంతా ఏం చూస్తున్నారు ఇందులో నా తప్పు ఏముంది అని సాక్షి దేవయానితో మాట్లాడుతుండగా బయటికి తీసుకుని వస్తుంది.

వసుధారను అరుస్తుండగా చూసిన రిషి: బయట ఉన్న వసుధారను చూడగానే కోపంతో సాక్షి అసలు నిన్ను అనాలి. నువ్వు ఎందుకు వచ్చావు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది అని అంటుంది. సాక్షి ఏం మాట్లాడుతున్నావ్ అని వసుదార అడుగుతుంది. అంతా నీవల్లే జరిగింది. నా జీవితం అంతా నాశనం అవుతుంది నీవల్ల. వెళ్ళిపొమ్మని సాక్షి అంటున్నాగా రిషి తలుపులు తెరిచి వసుధారని చూస్తాడు.

ఇది ఈరోజు జరిగిన 524 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker