Poorna: తన వివాహం విషయంలో క్లారిటీ ఇచ్చిన పూర్ణ

ఇటీవల కాలంలో సినిమా పెళ్లిళ్లు పెటాకులవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది తారలు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసి గా ప్చుప్ గా సినిమాలు చేసుకుంటున్నారు. మరికొందరైతే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లిళ్లు క్యాన్సల్ చేసుకున్నారు.

తన వివాహం విషయంలో క్లారిటీ ఇచ్చిన పూర్ణ

రష్మిక మెహరీన్ ఇలా కొంతమంది పెండ్లి పీటలు లెక్కకుండానే విడిపోయారు. తాజాగా ఈ లిస్టులోకి ఒక అమ్మడు వచ్చి చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. రఘు బాబు తెరకెక్కించిన అవును సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ పూర్ణ.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేకపోయింది. చాలా రోజుల తర్వాత బాలయ్య రీసెంట్గా నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.అలాగే పలు టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది పూర్ణ. ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లాడబోతోంది.

గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా కేరళలో గిరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగిందని. అయితే వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని చాలా రోజుగా వార్తలలో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తపై క్లారిటీ ఇచ్చింది పూర్ణ. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది.

ఒక ఫోటోతో పెళ్లి కాన్సిల్ అయిందని వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేసింది పూర్ణ. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు చేయనున్నారని తెలుస్తుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker