Guppedantha manasu serial today: ప్రేమను గెలిపించుకున్న రిషి
రిషి నేను ఒకటి నమ్మాను, దాన్ని ఆచరిస్తున్నాను నేను చేసేది కరెక్టా, తప్ప అని దేవున్ని అడుగుతూ ఉండగా, వసుధారని జగతి తీసుకుని వచ్చినట్లు కనిపించి, తననే చూస్తూ ఉంటాడు, అది కళ అనితెలుసుకొని బాధపడతాడు. దేవుని మొక్కి వెళ్తాడు రిషి. మీరు ఎందుకు సంతోషంగా లేరు అంటుంది. కనీసం నటించమని అంటుంది సాక్షి.
జగతిని నాకు అలాంటి అవసరం లేదు, నీకు మీ గురువుకు తెలుసు, రిషి మనసులో నువ్వు లేవు. జీవితం లో ప్రేమ, అనురాగం ,బంధం ఉండాలి. ఇలాంటివి ఇప్పుడున్న జనరేషన్లో ఉండవు అని సాక్షి అంటుంది. ఒక జంటని ఇవే నడిపించేవి నువ్వు రిషి నీ పెళ్లి చేసుకున్న ప్రేమను పొందలేవు అని అంటుంది. మీరు ఎన్ని చెప్పిన నేనేమీ పట్టించుకోను వెళ్దాం రండి అని జగతికి సమాధానం ఇస్తుంది. పూజారి మంత్రాలు చదువుతూ, పూజ జరిపించి, సాక్షిని రిషి పక్కన కూర్చోమంటాడు. వసుధార వచ్చి కూర్చో అని రిషి పిలుస్తాడు, కానీ సాక్షి వచ్చి కూర్చుంటుంది. ఉంగరాలు మార్చుకున్నాక లగ్న పత్రిక రాస్తాను, ఉంగరాలు ఇవ్వమని పూజారి చెప్తాడు. రిషి, సాక్షికి ఉంగరం పెడుతుండగా దాని మీద ఉన్న అక్షరం చూసి నిలబడుతుంది. ఏమైంది అని అందరూ అడగా దీనిమీద V అనే అక్షరం ఉంది చూడండి. అని సాక్షి కోపంతో అంటుంది. ఇది నిన్న జరిగిన 529 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.
తనకు జ్ఞానోదయం అయ్యిందని చెప్పిన సాక్షి: ఉంగరం మీద V అనే అక్షరం ఉందని విన్న అందరూ షాక్ గురవుతారు నా పేరు సాక్షి అంటే S అనే అక్షరం ఉండాలి కదా V అని ఎందుకు ఉందని సాక్షి ప్రశ్నిస్తుంది. రిషి సారీ అనుకోకుండా జరిగిందని సమాధానం ఇస్తాడు. నిన్ను పెళ్లి చేసుకోబోతున్న నా పేరు మర్చిపోయావా, వసుధార ప్రేమను మరువలేక పోతున్నావా అంటుంది. ఉంగరం లోనే అక్షరంతో ఆగదు ఇది తన మనసులో ముద్రించుకొని పోయింది. తన మనసులో నేను లేను, మనసంతా వసుధార మీదే ఉంది, ఈ పేరుతో జీవితాంతం బ్రతకాలా, ఈ పెళ్లి నాకు వద్దు అని ఉంగరాన్ని విసిరి కొడుతుంది సాక్షి. రిషి జగతి ఆంటీని తల్లి కాదు అని అంటే ఆంటీదే తప్పు అనుకున్నాను. వసుధార కాదు అనుకుంటే పిచ్చిదని అనుకున్నాను.
కానీ వీళ్లు కరెక్ట్ గానే చెప్పారు నీకు ప్రేమించడం రాదు, నీకు ప్రేమ విలువ తెలియదు జగతి ఆంటీ మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి తన తల్లిదండ్రులను వెళ్దాం రండి అంటుంది సాక్షి. సాక్షిని దేవాయాని ఆగమంటుంది. మీకు దండం, మీ కొడుకుకు దండం అని సాక్షి అంటుంది. నీకు ఏమైంది అని అడుగుతాడు. జ్ఞానోదయం అయ్యింది, నా కళ్ళు తెరుచుకున్నాయి, నేను ఇంతకాలం వేచి ఉన్నది నీకోసమా, లండన్ నుంచి నీకోసం వచ్చి నా టైం వేస్ట్ చేసుకున్నాను, నేను గెలిచి వెళ్ళిపోతున్నాను, ఇది నీ ఓటమి అని చెప్తుంది సాక్షి. మీ పెంపకం ఇలాంటిదే నని దేవయానిని అంటుంది సాక్షి. రిషికి కోపం వచ్చి సాక్షి ఆగు నీకు ఈ పెళ్లి నచ్చకపోతే వెళ్ళిపో నోటికి వచ్చినట్లు మాట్లాడకు అని అరుస్తాడు సాక్షివెళ్లిపోతుంది.
వసుధారను మంచి పని చేశావని మెచ్చుకున్న సాక్షి: కట్ చేస్తే వసుధారకు సాక్షి ఎదురుపడుతుంది. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ, సాక్షి లైఫ్ అవుట్ అయ్యింది, నువ్వు మాట్లాడ లేదంటే, మనసులో సంతోషంగా ఉన్నావు అంటుంది సాక్షి వసుధారను. ఈరోజు జరిగింది నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వే వద్దు అనుకున్నావు, ఒకరు గెలుపు కోసం కోరుకుంటే మనసు హాయిగా ఉంటుంది. ఒకరి నాశనాన్ని ఓటమిని కోరుకోవడం కరెక్ట్ కాదు అని వసుధార సాక్షికి సమాధానం ఇస్తుంది. అయినా నేను ఎలాంటి దానిని అందరికీ తెలుసు, ఒకరి ఓటమిని చూసి నేను సంతోషించేదాన్ని కాదు అని అంటుంది. రిషి అక్కడికి వస్తాడు సాక్షి రిషి ని చూడగానే వసుధారకూర్చో అన్న మాటలు గుర్తుకు చేసుకొని, రిషి ని కాదని నువ్వు చాలా మంచి పని చేశావు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, రిషి కి ప్రేమించడం తెలియదు, ప్రేమ విలువ తెలియదు అమ్మాయిలను గౌరవించడం తెలియని వాడని, కన్నతల్లిని అమ్మ అనే పిలవడం తెలియనివాడు ఏమీ తెలియదు, నువ్వు నాలాగా బాధపడకూడదు అని చెప్తున్నాను నువ్వు నీలాగే ఉండని అంటుంది సాక్షి.
రిషికి జీవితంలో ఎవరు తోడు లేకుండా చేస్తాను అన్న సాక్షి: నేను వెళ్తున్నాను అంటే నీ జీవితంలో నుంచి కాదు, నా బాధ ఏదో ఒక రూపంలో నీకు తగులుతాయని చెప్పి, సాక్షి వెళ్తూ నేను వెళ్ళిపోతున్నాను అంటే ఇక మళ్ళీ రాదు అనుకుంటున్నావా, నీకు జీవితంలో ఎవ్వరు తోడు ఉండరు, నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను సాక్షి అంటే నీకు తెలిసేలా చేస్తాను, అని మనసులో అనుకుంటూ సాక్షి వెళ్ళిపోతుంది. వసుధార కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే మహేంద్ర వచ్చి నువ్వే గెలిచావు, నీ మనసు గెలిచింది, నీ ప్రేమ గెలిచిందని ముద్దు పెట్టుకుంటాడు.
శుభకార్యం ఆగినందుకు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్న గౌతమ్: గౌతమ్ ధరణిని మంచి స్వీట్ కావాలని అడుగుతాడు. ఫంక్షన్ కోసం చేసినవి చాలా ఉన్నాయి కదా అంటుంది జగతి. అవి వద్దు మనకోసం మనం స్పెషల్ గా చేయించుకోవాలి అంటాడు గౌతమ్. సరే అవేంటో చేసి పెట్టమని ధరణికి జగతి చెప్తుంది. ఇంతలో దేవయాని వచ్చి ఏంటి జగతి నిశ్చితార్థం తప్పినందుకు స్వీట్ చేయమంటున్నావా, ధరణి నీకు ధైర్యం బాగా పెరిగినట్టుంది. మీరందరూ కోరుకున్నదే జరిగింది కదా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా, మీ కళ్ళు హాయిగా ఉన్నాయా అని అంటుంది. గౌతమ్ స్వీట్ అడిగాడు అని జగతి సమాధానం ఇస్తుంది. గౌతమ్ స్వీట్ అడిగితే ఇంట్లో శుభకార్యం ఆగిపోయింది దానిని సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కదా చెప్పాలి కదా అంటుంది దేవయాని.
ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 530 గుప్పెడంత మనసు సీరియల్ కథ.