Karthika deepam serial today:కార్తీక్ బ్రతికే ఉన్నాడని నిర్ణయించిన దీప

కార్తీక్ బ్రతికే ఉన్నాడని నిర్ణయించిన దీప:

సౌర్య నువ్వు చెప్పినది నేను వినను. నానమ్మ తాతయ్య చెప్పిన మాట వినమని  అంటుంది. నువ్వు నేను చెప్పినది నమ్మాలి అంటే ఏం చేయాలని హిమా అడుగుతుంది. అమ్మానాన్నలు వచ్చి చెబితేనే నేను నమ్ముతాను అంటుంది శౌర్య. అది ఎలా జరుగుతుంది, వాళ్లు చనిపోయారు కదా వాళ్ళు వచ్చి ఎలా చెప్తారు అని సౌందర్య సౌర్యని అంటుంది. సౌర్య అనుకున్నది నిజమే అని వారణాసి అంటాడు. వాళ్లు బతికే ఉన్నారు అని వారణాసి అంటాడు

కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనలు: వాళ్లు బ్రతికే ఉన్నారు అన్న నిజాన్ని వారణాసి చెప్పగానే హాస్పిటల్ లో దీపనుచూపిస్తారు. దీప గతం గుర్తుకు చేసుకొని డాక్టర్ బాబు అని అరుస్తూ లేచి కూర్చుంటుంది. అది విని నర్సు వచ్చి ఆమెకు స్పృహ వచ్చింది అని డాక్టర్ కు చెబుతుంది. వెళ్లి చూద్దాం రా అని డాక్టర్ అంటాడు. డాక్టర్ బాబు ఎక్కడ అని అంతా చూస్తూ తిరుగుతుంది దీప. నాతోపాటు కార్లో ఆయన ఉన్నారు అని అంటుంది.

నిన్ను ఒక్కదాన్నే తీసుకొని వచ్చారు, నీకోసం ఎవరూ రాలేదు అని డాక్టర్ చెప్తుండగా, నేను బ్రతికాను ఆయన కూడా బ్రతికే ఉంటారని, కార్తీక్ ను పిలుస్తూ ఏడుస్తూ వెతుకుతుంది దీప. పిల్లలు ఎక్కడ అని గుర్తుకు చేసుకుంటుంది. కట్ చేస్తే సౌర్య చిన్నతనంలో ఇలా ఎందుకు జరగాలి, నేను అమ్మ దగ్గర హిమ నాన్న దగ్గర ఉంటే బాగుండేది. ఎందుకు హిమకుకారునడపాలనిఅనిపించింది,అమ్మానాన్నలు దూరం కావడానికి ఇవే కారణం హిమే. అమ్మానాన్నలు కావాలి అనిపిస్తుందని పిన్ని అంటూ ఏడుస్తుంది సౌర్య. ఇది నిన్న జరిగిన 1431 ఎపిసోడ్ కార్తీకదీపం కథ.

కార్తీక్ బ్రతికే ఉన్నాడని నిర్ణయించుకున్న దీప: కార్తీక్ గురించి పిల్లల గురించి తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది దీప. నేను ఆయన కోసం కంగారు పడుతున్నట్టే, ఆయన కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నా పదేళ్ల నిరీక్షణకు ఫలితంగా దక్కినది ఇదా, తొందరగా నా డాక్టర్ బాబు దగ్గరికి నన్ను చేర్చు అని దేవుని వేడుకుంటుంది. అక్కడికి డాక్టర్ వచ్చి ఎవరు కావాలి అని అడుగుతాడు. ఆయన నా భర్త, హైదరాబాదులో పెద్ద హార్ట్ స్పెషలిస్ట్ అని జరిగినదంతా చెబుతుంది. అన్నా నాకు ఎలాగైనా సహాయం చేయండి అని అడుగుతుంది. నన్ను అన్న అని పిలిచావు, నీకు ఈ విషయంలో అండగా ఉంటాను అని అంటాడు డాక్టర్.

ఈ పరిస్థితుల్లో అక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు కదా అందుకని చనిపోయి ఉండవచ్చు. అలాంటి వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెడతారు వెళ్లి చూద్దాం రా అని అడుగుతాడు. సరే అని దీప డాక్టర్ తో కలిసి వెళుతుంది. నీకు యాక్సిడెంట్ జరిగిన రోజు ఒక బాడీ వచ్చింది. అది ఒకటి చూస్తే చాలు అంటాడు డాక్టర్. అక్కడ ఉన్న షూస్ చూసి గుర్తుపట్టి ఆయన కాకూడదని మనసులో అనుకుంటుంది దీప.

షూస్ ఉన్న డెడ్ బాడీ దగ్గరికి డాక్టర్ వెళ్లి చూపించి ఇదేనా వచ్చి చూడమని చెప్తాడు. దీప ఏడుస్తూ, భయపడుతూ దగ్గరికి వచ్చి నావల్ల కాదని అంటుంది. ఈవిడ భర్త కాకూడదని మనసులో దేవుని అనుకుని డెడ్ బాడీ మీద ఉన్న క్లాత్ ను తీస్తాడు, చూడు చూస్తే కదా తెలిసేది అనగా కార్తీక్ ను గుర్తుకు చేసుకొని దీప చూసి కాదని సమాధానం ఇస్తుంది. ఆయన బ్రతికే ఉన్నాడని డాక్టర్ చెబుతాడు.

ఈ ఇంట్లో ఉండడం వల్ల మనకు అన్ని నష్టాలే అమెరికా వెళ్ళిపోదామన్న సౌందర్య: సౌందర్య, హిమా, ఆనందరావు భోజనం చేయడానికి కూర్చుని వాళ్లు చనిపోయారని బాధపడుతూ, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం,ఈ ఇంటికి వచ్చాక మనం ఒక్కరోజు కూడా సంతోషంగా లేము అంటుంది. ఇల్లు వదిలి వెళ్ళినంత మాత్రాన అవి మనల్ని వదిలి వెళ్ళిపోతాయా అంటాడు ఆనందరావు. మనం ఈ ఇంటికి వచ్చాక మనకు అన్ని నష్టాలే జరిగాయి.

మొదట కార్తీక్ పెళ్లి వద్దన్నాడు, తర్వాత దీపను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అది నాకు నచ్చక కొన్ని రోజులు గొడవపడ్డాము, తర్వాత అందరం కలుసుకునే సమయానికి దీపా ఇంటిలో నుండి వెళ్ళిపోయింది, మౌనిత నా కొడుకు, కోడలు జీవితాన్ని అల్లకల్లోలం చేసింది, తర్వాత కొన్నాళ్లకి అందరం కలిశాము అనుకుంటే ,ఇంతలో వాళ్ళిద్దరూ ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు. అందుకే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోదాం అంటుంది. హిమ వద్దు.

మనం వెళ్ళిపోతే శౌర్య వస్తే ఎలా అని అడుగుతుంది. సౌర్యను బాగా చూసుకోవాలి అనేది అమ్మానాన్నల ఆఖరి కోరిక. సౌర్యను వదిలి నేను ఎక్కడికి రాను అంటుంది. సౌర్యను వెతుకుతానని మీ నానమ్మ మాట ఇచ్చింది కదా అలాగే వెతుకుతుంది. అలాగే వెళ్ళిపోదాం అని ఆనందరావు అంటాడు.

దేవునిపై నమ్మకథ ఉంటే అనుకున్నవి జరుగుతాయి అన్న డాక్టర్ తల్లి: డాక్టర్ తన తల్లికి దీపను పరిచయం చేస్తాడు. నువ్వు తొందరగా కోలుకోవాలని దేవుని ఎంతగానో కోరుకున్నాను. నీకు అలా జరిగినప్పటి నుంచి ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి నీ ప్రాణాలను నిలబెట్టాడు దేవుడు. ఈ రోజు మనకు కష్టం వచ్చిందని దేవుని తిట్టుకోకూడదు. ఏదో ఒక రోజు కచ్చితంగా ఫలితం వస్తుందని చెబుతుంది డాక్టర్ తల్లి .ఇది ఈరోజు జరిగిన కార్తీకదీపం 1432 ఎపిసోడ్ కార్తీకదీపం పూర్తి కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker