Guppedantha manasu serial today:జగతిని తల్లిగా అంగీకరించిన రిషి

జగతిని తల్లిగా అంగీకరించిన రిషి:

గౌతమ్ ధరణిని మంచి స్వీట్ కావాలని అడుగుతాడు. ఫంక్షన్ కోసం చేసినవి చాలా ఉన్నాయి కదా అంటుంది జగతి. అవి వద్దు మనకోసం మనం స్పెషల్ గా చేయించుకోవాలి అంటాడు గౌతమ్. సరే అవేంటో చేసి పెట్టమని ధరణికి జగతి చెప్తుంది. ఇంతలో దేవయాని వచ్చి ఏంటి జగతి నిశ్చితార్థం తప్పినందుకు స్వీట్ చేయమంటున్నావా, ధరణి నీకు ధైర్యం బాగా పెరిగినట్టుంది. మీరందరూ కోరుకున్నదే జరిగింది కదా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా, మీ కళ్ళు హాయిగా ఉన్నాయా అని అంటుంది.

గౌతమ్ స్వీట్ అడిగాడు అని జగతి సమాధానం ఇస్తుంది. గౌతమ్ స్వీట్ అడిగితే ఇంట్లో శుభకార్యం ఆగిపోయింది దానిని సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కదా చెప్పాలి కదా అంటుంది దేవయాని.

ఇది నిన్నజరిగిన ఎపిసోడ్ 530 గుప్పెడంత మనసు సీరియల్ కథ.

దేవయానికి సంతోషంగా ఉందని చెప్పిన గౌతమ్: గౌతమ్ దేవయానిని నిన్ను బెదిరించి మీ పెళ్లి చేసుకోవాలని సాక్షి అనుకుంది. అది తప్పిపోయింది. అలాంటప్పుడు మీరే ముందు సెలబ్రేట్ చేసుకోవాలని అంటాడు.రిషి తప్పులేదు సాక్షినే వద్దంది. తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అంటాడు. రిషి వచ్చి మీరేమీ బాధపడటం లేదు కదా అంటాడు. తనేమీ బాధపడటం లేదని సంతోషంగా ఉందని గౌతమ్ చెప్తాడు.

ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని చూస్తూ తన మనసులో మాటలను చెప్పాలనుకుంటున్నా వసుదార: వసుధార ఉంగరాన్ని చూస్తూ జరిగిందంతా గుర్తుకు చేసుకుంటూ వెళుతుంది. అప్పుడు గిఫ్ట్ ఇచ్చి మీ ప్రేమ విషయం చెప్పారు, ఇప్పుడు ఉంగరం మీద ఉన్న అక్షరంతో నా మీద ప్రేమను చూపిస్తున్నారా అని మాట్లాడుకుంటూ ఉండగా, రిషి ఫోన్ చేసి ఆటో నుంచి దిగమని చెప్తాడు. సరే అని నిలబడి చూస్తూ ఉండగా రిషి అక్కడికి వచ్చి కారులో కూర్చొని పిలుస్తాడు.

ఇక్కడ మహేంద్ర సంతోషంతో ఆనందపడుతూ డాన్స్ చేయాలని ఉంది అంటాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏడవడం, సంతోషం వస్తే డాన్స్ చేయడం లాంటివి చేయకూడదు. ఎమోషన్ ని అదుపులో ఉంచుకోవాలని జగతి అంటుంది. కోపం వస్తే అరుస్తాం, బాధ వస్తే ఏడుస్తారు, సంతోషం వస్తే డాన్స్ చేస్తామని మహేంద్ర జగతికి సమాధానం ఇస్తాడు. మనిషి అంటే దేవయాని లాగా ఉండాలి. ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. తను కావాలనుకున్నది జరిగేలా చేస్తుంది. అని అంటాడు మహేంద్ర.

రిషి గురించి బాధపడుతున్నాను అన్న దేవయాని: అంతా అయిపోయింది. పెళ్లి జరుగుతుంది. అనుకున్న టయానికి సాక్షి ఎందుకు ఇలా చేసింది. ఇప్పుడు రిషి నా మాట వినడు. సాక్షి ద్వారా జగతి మీద, వసుధార మీద గెలుద్దాం అనుకున్నాను కానీ ఇలా జరిగింది. ఇప్పుడు వసుధారకు లైన్ క్లియర్ అయింది. జగతికి బలం వచ్చింది. ఇప్పుడు సాక్షిని, రిషికి ముడి పెట్టడం అనేది అసాధ్యం అని కోపంతో అన్ని వస్తువులను విసిరేస్తుంది దేవయాని.

ధరణిని వెళ్లి చూడమని చెబుతుంది. ఎదుటి వాళ్ళ గెలుపు ఓటమిల గురించి ఆలోచించకూడదు. ఒక సంఘటన జరిగింది మన మంచికే అనుకోవాలి అని జగతి మహేంద్రకు చెబుతుంది. దేవయాని ధరణిని తిట్టి పంపిస్తుంది. తన ఆరోగ్యం బాగా లేనట్టుంది. డాక్టర్ని పిలుద్దాం అనుకుంటూ ఉండగా, దేవయాని వచ్చి ఎవరికోసం డాక్టర్. నన్ను రోగిష్టి దానిలా చేయాలనుకుంటున్నారా, నా బాధంతా రిషి కోసమే ప్రేమించిన వసుధార మోసం చేసింది. సాక్షి పెళ్లి వద్దని వెళ్ళిపోయింది. నేను రిషి గురించి బాధపడుతున్నాను. మీకు సంతోషంగా ఉందేమో రిషి ఎంత బాధ పడుతున్నాడో, అని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేస్తుంది దేవయాని. మహేంద్ర వదిన నిజస్వరూపం రిషికి ఏదో ఒక రోజు తెలుస్తుంది అని అంటాడు.

తనే గెలిచాను అన్న వసుధార: రిషి వసుధాలను జరిగిన దారి గురించి ఏమనుకుంటున్నావు, నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అంటాడు. అడగటానికి ఏమీ లేదు, అన్నిటికి సమాధానాలు దొరికాయి అని వసుధార అంటుంది. నీకు చెప్పకుండా నీ పేరు వాడినందుకు ఏమైనా అనుకుంటున్నావా, అలా అయితే దానికి అని చెప్తుండగా సారీ చెబుతారా, అలాంటివి చెప్పవద్దని వసుధార అంటుంది.

నేను కావాలని చేయలేదు. వర్షం తుఫానుగా మారుతుంది. ఇప్పుడు నా జీవితంలో తుఫాను వెలిసినట్టుంది. సాక్షి నాకు దూరమైనందుకు బాధగా లేదు, ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర లేదు అని అంటాడు రిషి. ఇప్పుడు సాక్షి దూరమైందని నిన్ను ఇబ్బంది పెట్టను, ఏదేమైనా నేను గెలిచాను అంటాడు. వసుధార నేను కూడా గెలిచానని సమాధానం ఇస్తుంది. రెస్టారెంట్ కు వెళ్దాం అని అనుకొని వెళ్ళిపోతారు.

పెళ్లి ఆగిపోయినందుకు కేకు కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న మహేంద్ర, గౌతమ్: పెళ్లి ఆగిపోయినందుకు సంతోషంతో రెస్టారెంట్లో గౌతమ్, మహేంద్ర, సాక్షి పేరుతో పాటలు పాడుతూ ఉంటారు. మేము చాలా సంతోషంగా ఉన్నామని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఆనందంలో కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుందాం అనుకొని, వెయిటర్ ను పిలుద్దాం అనుకుంటుండగా రిషి, వసుధార అక్కడికి వస్తారు. వారిని చూసి లేచి నిలబడతారు. ఇది ఈరోజు జరిగిన531 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker