Guppedantha manasu serial today:రిషికి సాక్షితో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్న దేవయాని.

రిషికి సాక్షితో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్న దేవయాని: ఇది ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన కథ

ఈ రాత్రి సాక్షిగా, మన ప్రేమ కథ మొదలవుతుంది.  ఇది ఒకరినొకరు తెలుసుకున్న సమయం. ఇది కథ కాదు, శాశ్వతం అని ఇద్దరు కౌగిలించుకొని అలాగే ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత కారులో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వెళుతూ ఈ ప్రయాణంలో ఏదో కొత్తదనం, ఎంత హాయిగా ఉందో, చూసావా నువ్వు చెప్పేది నేను చెబుతున్నాను అని రిషి వసుధారతో మాట్లాడుతాడు.

 ఇదినిన్న జరిగిన 539 ఎపిసోడ్  గుప్పెడంత మనసు సీరియల్ కథ.

రిషి వసుధారల ప్రేమ గురించి మహేంద్ర తెలుసుకుంటాడో లేదో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

మనం కలుసుకున్న టైం కి థాంక్స్ చెబుతున్నావని వసుధారని అన్నా రిషి: నేను చెబితే మీకు బాగుండేది, మీరు చెబితే నాకు బాగుంది అని అంటుంది వసుధార. ఏ క్షణంలో మొదలైందో మా పరిచయం, ఆ క్షణానికి వేల కృతజ్ఞతలు, మేము ఆ సమయానికి లేకపోతే ఎన్నో కోపాలు కరిగి, ఎంత దగ్గర  అవుతామా అని వసుధార మనసులో అనుకుంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, అదేంటో నేను చెప్పమంటావా అని అంటాడు రిషి. కనిపెట్టారా సార్ అని వసు అడుగుతుంది. ఫస్ట్ టైం కలిసిన టైం ఎప్పుడో కోపాలాన్ని తగ్గి ఒకటయ్యాయి ఒక్కటయ్యాము థాంక్యూ టైము అని అనుకుంటున్నావు అని అంటాడు. రెండు గుండెల చప్పుడు ఒక్కటైతే ఇద్దరం అనుకునేది ఒకటే కదా, అదే ప్రేమలోని మాయ అంటాడు.

వెళ్లి రెస్ట్ తీసుకో రేపటి నుంచి నీ ధ్యాస అంతా చదువు మీదనే అని చెబుతాడు. సరే అని చెప్పి వెళ్ళిపోతూ పిలిచారా అని అడుగుతుంది వసుదార. గుడ్ నైట్ నీ మనసు నాకు అర్థమైంది కానీ ఈ దూరం అవసరం అని చెప్పి రిషి తనను డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు.

చాలా సంతోషంగా ఉన్నానని తన నీడతో తనే మాట్లాడుకున్న రిషి: దారిలో సంతోషంతో పొంగిపోతూ ఈ రాత్రి చాలా బాగుంది. రిషేయేంద్రభూషణ్ నీ లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది. లైఫ్ చాలా పాఠాలు నేర్పింది. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఇన్ని తెలిపిన కాలానికి థాంక్యూ అని చెబుతూ, తన నీడను చూసి వసు అన్న మాటలు గుర్తుకు చేసుకొని. రిషి నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండు, సంతోషం వచ్చినా ,బాధ వచ్చిన ధైర్యంగా ఉండు, వసుధార నీది, నువ్వు తన ప్రాణం. తన ఆశయం నువ్వే నిలబెట్టు అని తన నీడతో తనే మాట్లాడుకుంటాడు.

ఎలాగైనా రిషితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటున్న మహేంద్ర, గౌతమ్: మహేంద్ర, గౌతమ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. గౌతమ్ ఏం ఆలోచిస్తున్నామని మహేంద్ర అడిగితే, రిషి గురించే ఆలోచిస్తున్నాను. మీరైనా చెప్పండి అని అడుగుతాడు  నాకు ఏమీ అర్థం కావడం లేదని వాడిని అడిగితే చెప్పడు, మనం అర్థం చేసుకోలేం, వాడు చెప్పినప్పుడే మనం వినాలి అని అంటాడుమహేంద్ర .ఏంటి అంకుల్ మీరు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారని అంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కారు శబ్దం విని వాడు వచ్చినట్లు ఉన్నాడు. ఇప్పుడే అడిగేద్దాం ఫస్ట్ నువ్వు అడుగు, లేదు నువ్వు అడుగు అని అనుకొని సరే అనుకుంటారు.

రిషి రాగానే గౌతమ్ హాయ్ రా, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని పిలుస్తాడు. బాగా అలసిపోయాను గుడ్ నైట్ అని అంటాడు రిషి. మహేంద్ర రిషి ని పిలవగానే మార్నింగ్ మాట్లాడుకుందాం డాడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం అని ఇద్దరు అనుకుంటారు.

జగతికి థాంక్స్ చెప్పిన  రిషి: జగతి రిషికి ఎదురుగా వస్తుంది. రిషికి జగతి వెనకాల వసుధార ఉన్నట్లుగా, జగతి మేడం నన్ను పంపించారు అని అన్నట్లుగా కలకంటాడు. రిషి అలాగే నిలబడిపోతాడు. జగతి రిషి  ని పిలిచి ఏమైంది అని అంటుంది. రిషి వసుధార ను నువ్వు ఆవిడ స్టూడెంట్వి, అన్న మాటలు గుర్తుకు వస్తాయి. తెగిపోయిన బంధం ఇంకొక అందమైన అనుబంధాన్ని అందించింది. అని మనసులో అనుకొని థాంక్యు మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏమైంది అని జగతి అనుకుంటూ ఉంటుంది.

ఫోన్ చేసి మాట్లాడాలా వద్దా అని ఇద్దరూ అనుకుంటూ ఉన్న రిషి, వసుధార: వసుధార రిషి ఫోటోలు చూస్తూ రిషి ప్రేమను అంగీకరించిన విషయం గుర్తుకు చేసుకుంటుంది ఇక్కడ రిషి కూడా వసదార ప్రపోజ్ చేసిన విషయం గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఏం చేస్తున్నారని ఇద్దరు అనుకుంటుంటారు మెసేజ్ చేద్దాం అని ఇద్దరు అనుకుని మాట్లాడవద్దు కలవదు అని అనుకున్నాం కదా మళ్లీ నేను మెసేజ్ చేస్తే ఏం బాగుంటుంది అనుకుంటారు వసుధర కూడా అలాగే అనుకొని వద్దనుకొని ఉంటుంది.

రిషి ని పెళ్లి చేసుకోమని సాక్షికి నచ్చ చెబుతున్న దేవయాని: సాక్షిని దేవయాని ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. మీరు నన్ను బలవంతం చేస్తున్నారు. నా మనసు ఎప్పుడో విరిగిపోయిందని అంటుంది. ఒకసారి కోపంతో రిషి తో బంధం తెంచుకోవద్దు. కరెక్ట్ కాదు, జీవితాంతం బాధపడతావు ఆలోచించమని దేవయాని అంటుంది. నాకు వచ్చిన కోపంలో అర్థం ఉంది.  ఒక్కసారికే రియాక్ట్ అవ్వలేదు. చాలాసార్లు హర్ట్ చేశాడు. భర్త పేదవాడైనా పరవాలేదు కానీ తన భర్త నోటివెంట వేరే వాళ్ళ పేరు వింటే ఎంత బాధ ఉంటుందో అలాంటిది. నా పేరుకు బదులు, వసుధార పేరులోనే అక్షరాన్ని ఉంగరం  చేయించడం ఏంటి, అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను అని అంటుంది.

ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. అవి అయ్యేవరకు సైలెంట్ గా ఉందాం. ఎంత బలం ఉన్న  ఒక్కొక్కసారి మౌనంగా ఉండటానికి మించిన ఎత్తు కూడా ఇంకొకటి ఉండదు. నేను ప్లాన్ చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఎగ్జామ్స్ అయిపోతే వసుధారని లేకుండా చేస్తాను. ఒంటరి అయిన రిషిని మన వైపు తిప్పుకోవడం చాలా ఈజీ అని సంతోషంతో మాట్లాడుకుంటూ ఉంటారు.

ధరణికి నీ మనసులో అనుకున్నదే నిజం అవుతుంది అని చెప్పిన దేవయాని: ధరణి వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు అని అనుకుంటూ, కాపీ తెచ్చి ఇస్తుంది. అడగకముందే కాఫీ ఇస్తున్నావేంటి? మేము ఏం మాట్లాడుకుంటున్నామో విందామని వచ్చావా అని ధరణిని అంటుంది దేవయాని. అదేం లేదు అని సమాధానం ఇస్తుంది. ధరణి విన్నా,వినకపోయినా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే నిజమవుతుందని దేవయాని అంటుంది.

నేను చాలా సంతోషంగా ఉన్నానని దేవయానితో అన్న జగతి: ఉదయం కాగానే రిషి లేవక ముందే గౌతమ్, మహేంద్ర వచ్చి నువ్వు లేపు నువ్వు లేపు అనుకుంటారు. వీడి మనసులో ఏముందో తెలుసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన జగతి మీరు చేసేది తప్పు. నిద్రలేపి ఏం మాట్లాడుతారు. బయటికి రమ్మని పిలుస్తుంది. మహేంద్ర రిషి ని లేపడానికి చూస్తుండగానే, దేవయాని ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది. రిషి లేస్తాడేమో  అని వెయిట్ చేస్తున్నామని అంటుంది. మహీంద్రా రిషికి కాపీ ఇచ్చి ప్రసన్నం చేసుకుందామని అంటాడు. గౌతమ్ ఎప్పుడు మాట్లాడాలి అన్న పని ఉందని తప్పించుకుంటున్నాడు, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అని అంటాడు.

మీరు ముగ్గురు ఒక్కొక్కలా చెప్తున్నారు. అసలు ఏంటి అని అడుగుతుంది దేవయానీ. మనకు కార్ రిపేర్ చేసే పని ఉందని, వెళ్దాం రా అని అనుకుంటూ మహేంద్ర గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. దేవయాని నిన్ను ఎప్పటికీ అమ్మ అని రిషి  పిలవడు అంటుంది. పిలువకపోయినా ఫర్వాలేదు, నేను రిషి అని పిలుస్తున్నాను. నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాఫీ చల్లారిపోయింది. రిషి లేస్తే ఇబ్బంది పడతాడు. వెళ్లి మళ్ళీ పెట్టుకొని వస్తానని జగతి వెళ్ళిపోతుంది.

రిషి చెప్పిన మాటలు పేపర్ లో రాసి మురిసిపోతున్న వసుధార: వసుధారలేసి రిషి ఫోటోకు  గుడ్ మార్నింగ్ చెబుతుంది. నేను బాగా చదువుకుంటున్నాను, కావాలంటే చూడండి అని ఫోటోకు పుస్తకాలన్నీ చూపిస్తూ, నా ఆశయం లక్ష్యం ఇదే అని గుర్తుపెట్టుకుంటాను అని అంటుంది. మీరు నమ్మడం లేదా అని,  నీ ఆశయమే ముఖ్యం అని పేపర్లో రాసి గోడపై అతికించి, దాన్ని చూస్తూ మురిసిపోతుంది. దీనిని ప్రతిక్షణం చూస్తూ ఉంటే మీరే గుర్తుకు వస్తారు. మీరు నాకు ప్రేరణ. ఇది నాకు ప్రేరణగా ఉంటుందని అంటుంది. ఇది ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కథ.

రిషి వసుధారలు మాటమీద నిలబడి మాట్లాడకుండా కలుసుకోకుండా ఉంటారో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker