Karthika deepam serial today:కార్తీకు బ్రతికే ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుందని భయపడ్డా మౌనిత
కార్తీకు బ్రతికే ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుందని భయపడ్డా మౌనిత:
ఇది ఈరోజు జరిగిన కార్తీకదీపం సీరియల్ కథ.
శౌర్య గురించి ఆలోచించి తలనొప్పిగా ఉంది అంటుంది. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు హిమ అని చెప్పి, మీరు ఏం ఆలోచిస్తున్నారో అంటుంది. మనం బలవంతంగా అయినా శౌర్య తీసుకొని వచ్చుంటే బాగుండేది అంటాడు. బలవంతంగా తెస్తే ఎలా ఉంటుంది. మనం కాపలా కాయలేం. మళ్లీ వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా గుర్తుకు వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాం. ఈసారి వెళ్తే అసలు మనకు కనిపించదు. ఎప్పటికైనా మనసు మారి రావాల్సిందే అని సౌందర్య అంటుంది.
ఇది ఈరోజు నిన్న కార్తీకదీపం 1442 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.
మౌనిత దగ్గరే కార్తీక్ ఉన్నాడని దీప ఏ విధంగా తెలుసుకుందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
కార్తీకు గతం గుర్తుకు వస్తే తనకు దూరమవుతాడని భయపడుతున్న మోనిత: మౌనిత కార్తీక్ ను గుర్తుకు చేసుకొని, కార్తీక్ నామీద కోపం చూపించడం ఇదే మొదటిసారి. అంతా ఇరిటేషన్ ఎందుకు వచ్చింది. నేను కంట్రోల్ చేసుకున్నందుకు సరిపోయింది. లేదంటే చాలా పెద్ద గొడవ జరిగేది.
దీప అని ఎందుకు పిలిచాడు. ఇలా అయితే ఎప్పటికైనా కష్టం. మనిషిని, మనసును ఆలోచనలను అన్నిటిని నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి. లేదంటే నా గుప్పెట్లో ఉండడు. ఎన్ని ఏళ్ల నుంచి, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేనిది, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. వదిలి పెట్టుకోకూడదు. అని అనుకొని తలనొప్పిగా ఉంది స్ట్రాంగ్ గా కాఫీ తాగుదామని అనుకుంటూ ఉంటుంది మోనిత.
కాఫీ షాప్ లో సౌందర్యను, హిమను, ఆనందరావును, చూసి టెన్షన్ పడిన మౌనిత: సౌందర్య వాళ్లు ఉన్న హోటల్లోకి వస్తుంది మౌనిత. హిమ గుర్తుపట్టి సౌందర్యకు చూపిస్తుంది. సౌందర్య చూసి ఇక్కడ ఎందుకు ఉంది. ఇది ఎక్కడ ఉన్నా అక్కడ సంతోషం ఉండదు. ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలని వచ్చిందో అని అంటుంది. వీళ్లు ఇక్కడ ఎందుకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసిపోయారా, దీప ఫోన్ చేసి చెప్పిందా, వీళ్లంతా కలిసి నా మీద అటాక్ చేయబోతున్నారా, వీళ్లంతా కార్తీక్ ను కలిస్తే గతం గుర్తుకు వస్తుందని మనసులో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది మౌనిత. అయినా భయపడకూడదు, నేను భయపడితే వాళ్లకు అనుమానం వస్తుందని, మనసులో అనుకొని వాళ్ళని దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది.
సౌందర్య నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తుంది. చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చానని సమాధానం ఇస్తుంది. మౌనిత మీరేంటి అనగా, ప్రమాదం జరిగింది ఇక్కడే కదా మనసంతా ఇక్కడే ఉండి ఒకసారి చూసి వెళ్దామని వచ్చామని సౌందర్యం అంటుంది. ఇంతలో కార్తీక్ ఫోన్ చేస్తాడు. సౌందర్య చూడకుండానే మౌనిత ఫోన్ తీసుకుంటుంది. పెళ్లి చేసుకున్నావా అని సౌందర్య అడుగుతుంది. లేదు అని చెబుతూ కార్తీక్ దూరం కాగానే ఆస్తులన్నీ ఇచ్చేసి వచ్చాను. తెల్ల చీరలో ఉంటే పాత జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి. అందుకే రంగు మార్చానని సమాధానం ఇస్తుంది. మళ్లీ కార్తీక్ ఫోన్ చేసింది చూసి, టెన్షన్ పడుతూ ముఖ్యమైన ఫోను వచ్చిందని చెప్పి, అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు మనల్ని చూసి కంగారుపడుతుంది. అప్పుడుతప్పు చేసినందుకు కంగారు పడింది. ఇప్పుడు ఎందుకు కంగారుపడుతుంది. ఏదో తేడాగా ఉంది అని ఆనందరావు, సౌందర్య అనుకుంటారు.
కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉన్న దీప: ఇక్కడ దీప మౌనిత శివను తీసుకొని వెళ్ళిన విషయం గుర్తుకు చేసుకొని, మౌనితని ఆయన గుర్తుపట్టారా నన్ను గుర్తు పట్టనట్లే గుర్తుపట్టలేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్ గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అవును ఆయన మౌనితకు కనిపించే ఉంటాడు కదా అని ఆలోచిస్తున్నానని అంటుంది దీప. మౌనితకు కనిపించినంత మాత్రాన లాభం లేదు. తను ఏమి చేయలేదు. ఏదో ఒక రోజు నీకు కనిపిస్తాడని చెబుతాడు. నేను ఏదో ఒక పని చేస్తాను. నాకు ఒక పని చూడమని దీప అంటుంది. ఏం పని చేస్తావు అని డాక్టర్ అంటాడు.
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచడం లేదు, పని దొరికితే పనికి వెళ్లినట్టు ఉంటుంది. అలాగే ఆయన్ని వెతికినట్టు కూడా ఉంటుందని సమాధానం ఇస్తుంది.
మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అని అన్న కార్తీక్: ఇక్కడ కార్తీక్ మౌనిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మోనిత వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో అని అంతా చూసుకుంటూ, ఇప్పటినుంచి కార్తీక్ ను బయటకి పంపించకూడదని మనసులో అనుకొని కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు తీయడం లేదు అని అంటాడు. మీ వాళ్లంతా పక్కన ఉంటే ఎలా ఫోన్ తీయాలి అని మనసులో అనుకుని మీటింగ్ లో ఉన్నాను, అందుకే మాట్లాడలేదని అంటుంది. ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుందని అంటాడు.
మీటింగ్లో ఉంటే ఎలా మాట్లాడుతాను, ఒక్కసారి కట్ చేస్తే అర్థం కాలేదా మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తావని అంటుంది. నేను నాలుగు సార్లు ఫోన్ చేయగానే నీకు కోపం వచ్చింది. నేను బయటికి వెళ్ళగానే అన్నిసార్లు ఫోన్ చేస్తావు నాకు కోపం రాదా అని అంటాడు. అది వేరే ఇది వేరు అని మౌనిత సమాధానం ఇస్తుంది. నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకట. నువ్వు బయటికి వెళ్లినప్పుడు నేను ఎప్పుడైనా ఫోన్ చేశానా? ఎందుకు ఫోన్ చేశాడో, ఏంటో అని అడగాల్సింది పోయి చిరాకు పడుతున్నావు. నేను బయటికి వెళ్లినప్పుడు అన్ని సార్లు ఫోన్ చేస్తావు.
నేను ఎంత చిరాకు పడాలి అని అంటాడు. మౌనిత సరే సారీ అని చెప్పి ఎందుకు ఫోన్ చేశావని అడుగుతుంది. ఆన్లైన్లో చెక్ చేశాను, హైదరాబాద్ కు వెళ్దాం అంటాడు. ఎందుకని అడుగుతుంది మోనిత. ఎందుకంటే హైదరాబాదులో మనం షాప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి హైదరాబాదుకు వెళ్దాం. అయినా హైదరాబాద్ వెళ్దాం అంటేఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటాడు. అదేం లేదని సమాధానం ఇచ్చి అక్కడికి వెళ్తే షాప్ అంతా ఎలా ఉంటుంది అని అంటుంది.
దానికోసమే అక్కడికి వెళ్తే బాగా సంపాదించు కోవచ్చు. ఇక్కడ బయటికి పంపడానికి భయపడుతున్నాను కదా భయపడుతున్నావు కదా అక్కడ అయితే బాగుంటుందని అంటాడు. నీ ఆరోగ్యం బాగాలేదు, అసలు అక్కడ కాలుష్యం ఎక్కువ. నీకు కాలుష్యం అంటే పడదు, అందుకని వద్దు అని చెబుతున్నా అంటుంది. ఇక్కడే ఎవరు గుర్తుపడతారో అనుకుంటూ ఉంటే మళ్లీ అక్కడికి వెళ్లాలంట, అక్కడికి వెళ్తే అందరూ గుర్తుపడతారు అనిమనసులో అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది.
ఆటోకు అమ్మానాన్నలు ఎక్కడ అని స్టిక్కర్ అంటించమని చెప్పిన సౌర్య: ఇక్కడ కొత్త ఇంట్లోకి శౌర్య వాళ్ళు వస్తారు. ఈ ఇల్లు చాలా బాగుంది పిన్ని అని సౌర్య అంటుంది. నేను అలిగాను అక్కడ చాలా బాగుండేది. కలిసి వచ్చేది. నిన్ను మాకిచ్చిన ఆ ఇంటిలోనే ఉండాలని అనుకున్నాను అంటుంది. ఇక్కడ కూడా ముందు ముందు చాలా బాగుంటుంది అని సౌర్య అంటుంది. అక్కడ ఉంటే ఏదో ఒక రోజు నానమ్మ తాతయ్య వచ్చి, నన్ను తీసుకుని వెళ్లి, ఆ హిమతో ఉంచుతారు. అందుకే ఇక్కడికి వచ్చామని మనసులో అనుకుంటుంది శౌర్య.
గండ ఆటో తీసుకొని వస్తాడు. ఆటో చాలా బాగుంది. నువ్వే కొన్నావా అని అడిగితే లేదు నా దగ్గర అంత డబ్బు లేదు. కిరాయికి తెచ్చానని చెబుతాడు. ఏమీ పరవాలేదు ఆటోతో వచ్చే డబ్బులతో ఆటోను కొందాం అని చెప్పి, నేను చెప్పిన స్టిక్కర్ను అంటించావా అంటుంది. నువ్వు చెప్తే మేము చేయకుండా ఉంటామా, చూపిస్తాను అని ఆటో వెనక్కి తీసుకొని వెళతాడు. అమ్మానాన్నలు ఎక్కడ అని రాసి ఉండడం చూసి వాళ్లిది చూడగానే వాళ్ళకు అర్థం అవుతుంది .దీనిని నేనే రాశాను అని నా దగ్గరికి వస్తారని చెబుతూ బాధపడుతూ ఉంటుంది సౌర్య. వాళ్లు బ్రతికి వచ్చే అవకాశం ఉందా అని చంద్రమ్మ, గండతో అంటుంది. ఏమో బ్రతికి వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఉండలేకపోవచ్చు ఒకవేళ ఉంటే ఇది చూసి సౌర్య దగ్గరికి వస్తారు కదా అని సమాధానం ఇస్తాడు.
పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్న దీప: దీప పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్లని చూసే అవకాశమే లేకుండా పోయింది. అత్తయ్యకు ఫోన్ చేద్దామంటే వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయారు. నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు. మేము లేమని ఎంత బాధ పడుతున్నారో, అందరూ ఉండి ఎవరిని కలవలేక పోతున్నాను. ముందు ఆయనని వెతికి నా దగ్గరికి తెచ్చుకుంటే, ఆయనే అంతా చూసుకుంటారని అనుకుంటూ ఉంటుంది దీప.
ఇది ఈరోజు జరిగిన 1443 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.
దీప కార్తీక్ ను కలుసుకుందో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.